ఆన్‌లైన్‌లో రెండుపడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరుతు సీపీఎం సికింద్రాబాద్ కార్యదర్శి అజయ్ బాబు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో అడ్డగుట్టలోని మరేడిపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఈ నిరసన జరిగింది. ఈ నిరసనలో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరారు.
ఫ్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రెవెన్యూ పరిధిలో చాల మంది .. అద్దె గృహాలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్తగా ఎవరైతే ఇండ్లు లేని వారు ఉన్నారో వెంటనే వారి వివరాలను తమకు సమర్పించాలని ఎమ్మార్వో సునీల్ సూచించారు. అజయ్‌బాబును తుకారాంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: చక్కా జామ్: భద్రతా వలయంలో దేశ రాజధాని