ETV Bharat / state

ఓటుకు నోటు కేసులో క్రాస్ ఎగ్జామినేషన్​కు చివరి అవకాశం - నిందితులకు ఆఖరి అవకాశం

ఓటుకు నోటు కేసు నిందితులకు అనిశా న్యాయస్థానం చివరి అవకాశమిచ్చింది. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కొంత సమయం కావాలని వారి తరఫు న్యాయవాదులు కోరడంతో తదుపరి విచారణ జూన్​ 2కు వాయిదా వేసింది.

The case for the note for vote
ఓటుకు నోటు కేసులో చివరి అవకాశం
author img

By

Published : May 10, 2021, 3:38 PM IST

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్​ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర నిందితులకు అనిశా న్యాయస్థానం చివరి అవకాశం కల్పించింది. తనకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేసిన స్టీఫెన్ సన్​ను ఈ కేసులో మొదటి సాక్షిగా అనిశా పేర్కొంది.

స్టీఫెన్ సన్​పై ప్రధాన విచారణ పూర్తి చేసి వాంగ్మూలం నమోదు చేసిన ఏసీబీ కోర్టు.. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు చివరి అవకాశమిచ్చింది. ఇవాళ స్టీఫెన్ సన్ కోర్టుకు హాజరైనప్పటికీ...తమకు కొంత సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను జూన్ 2కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనం బారులు... రెండో డోసు కోసం నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.