ధాన్యంపై వెనక్కి తగ్గేది లేదని భాజపా మరోసారి స్పష్టం చేసింది. తక్షణమే వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలు విజయవంతమయ్యేందుకు జిల్లా ఇంచార్జీలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీకార్యాలయంలో జాతీయ కార్యవర్గసభ్యులు, జిల్లా అధ్యక్షులు సహా పలువురు నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్ వేర్వేరుగా సమావేశమయ్యారు(BJP Meeting in Telangana).
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: Revanth Reddy on CM KCR: సీబీఐ విచారణ వేయించండి.. కేసీఆర్ అవినీతిని నిరూపిస్తా: రేవంత్