ETV Bharat / state

'కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ వైఖరికి కామారెడ్డి ఘటన నిదర్శనం' - కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం

Tharun Chug Fires on BRS Government : కామారెడ్డిలో రైతులపై లాఠీఛార్జీని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్‌ తీవ్రంగా ఖండించారు. అవినీతి కుటుంబపాలనలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ, నియంతృత్వ వైఖరికి కామారెడ్డి ఘటన అద్దం పడుతుందని మండిపడ్డారు.

తరుణ్ చుగ్
తరుణ్ చుగ్
author img

By

Published : Jan 7, 2023, 10:26 PM IST

Tharun Chug Fires on BRS Government : దేశ చరిత్రలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని తరుణ్‌చుగ్ అన్నారు. కామారెడ్డి ఘటనలో భాజపా కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రియల్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌ను వెనక్కు తీసుకోవాలన్నారు. కేసీఆర్ అనుచరులు రైతుల భూములను ఆక్రమించుకునేందుకే ధరణి పోర్టల్‌ ఉపయోగపడుతుందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ హామీ అమలు చేయడంలోనూ కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు.

అసలు విషయం ఏంటంటే..: కామారెడ్డి పురపాలక సంఘానికి నూతన బృహత్ ప్రణాళికను రూపొందించే క్రమంలో పరిసర ప్రాంతాల్లోని 8 గ్రామాల్లో 2,170 ఎకరాల సాగు భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. మాస్టర్‌ ప్లాన్‌ను నిరసిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తుండగా.. రెండ్రోజుల క్రితం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. రైతులు చేస్తున్న ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

పారిశ్రామిక జోన్‌లో సాగు భూములు కలపొద్దని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కామారెడ్డిలో ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో కలిసి అకస్మాత్తుగా చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. రెండు గంటల పాటు పోలీసులు, కార్యకర్తలు, రైతుల మధ్య పెద్దఎత్తున తోపులాట జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.