ETV Bharat / state

ఉగ్రవాది టుండా కేసు తీర్పు మరోసారి వాయిదా

ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా కేసులో తీర్పు మరోసారి వాయిదా పడింది. టుండాపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడిన కేసులున్నాయి. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా నాంపల్లి కోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

author img

By

Published : Feb 18, 2020, 9:38 AM IST

Updated : Feb 18, 2020, 3:02 PM IST

abdul karim tunda
abdul karim tunda

ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ టుండా కేసు మరోసారి వాయిదా పడింది. తీర్పును వచ్చే నెల 3వ తేదీకి నాంపల్లి న్యాయస్థానం వాయిదా వేసింది. లష్కరే తోయిబా తీవ్రవాది టుండా... హైదరాబాద్​లోని హుమాయున్ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ నెల 4న తుది తీర్పు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ... నేటికి తీర్పు వాయిదా పడింది. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది.

పేలుళ్లలో నిష్ణాతుడు

టుండాపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడిన కేసులున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న టుండా... బాంబుల తయారీ, పేలుళ్లలో నిష్ణాతుడిగా పేరు పొందాడు. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత... 1993లో ముంబయిలో జరిగిన వరుస పేలుళ్లలోనూ టుండా నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్​లో టుండా తలదాచుకున్నాడు. ఐఎస్ఐతో పాటు పలు ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలు పెట్టుకున్నాడు.

40కి పైగా కేసులు

2008లో ముంబయిపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్... పాకిస్థాన్​ ఇచ్చిన 20 మంది ఉగ్రవాదుల జాబితాలోనూ టుండా పేరుంది. 2013 ఆగస్టులో భారత్-నేపాల్ సరిహద్దులో టుండాను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు రాష్ట్రాల్లో టుండాపై 40కి పైగా పేలుళ్ల కేసులున్నాయి.

ఇదీ చూడండి: హైదరాబాద్‌లో ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండా

Last Updated : Feb 18, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.