తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన నివాసంలో అచ్చెన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటబొమ్మాళి పోలీసుస్టేషన్‌కు ఆయన్ను తరలించారు.
పంచాయతీ తొలివిడత నామినేషన్లలో వైకాపా, తెదేపా నేతల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా.. అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: బలవర్ధక ఆహారానికి బహుదూరంగా..