ETV Bharat / state

దుర్గామల్లేశ్వరస్వామి రథంపై తాత్కాలికంగా వెండి సింహాల ఏర్పాటు

author img

By

Published : Apr 14, 2021, 7:54 AM IST

ఉగాది పర్వదినం సందర్బంగా విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామిని రథంపై ఊరేగించారు. ఇందులో భాగంగా.. రథంపై వెండి సింహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసి రథోత్సవం నిర్వహించారు. అనంతరం వాటిని లాకర్​లో భద్రపరిచారు.

durga malleswara swamy temple, durga malleswara swamy rathotsavam
దుర్గమల్లేశ్వర స్వామి రథోత్సవం, విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామిని రథంలో మంగళవారం ఊరేగించారు. గతంలో ఈ రథానికి సంబంధించిన నాలుగు వెండి సింహాల బొమ్మల్లో మూడు చోరీకి గురైన విషయం విదితమే. ఆ తర్వాత చోరుడి నుంచి వెండిని స్వాధీనం చేసుకోవడంతో మళ్లీ కొత్తగా నాలుగు సింహాలను తయారు చేయించారు. వాటిని తొలిసారిగా తాత్కాలికంగా అమర్చి రథోత్సవం నిర్వహించారు.

భద్రతా కారణాల నేపథ్యంలో ఊరేగింపు అనంతరం ఆ నాలుగు సింహాల బొమ్మలను తొలగించిన దేవస్థానం అధికారులు వాటిని లాకర్‌లో భద్రపరిచారు. రథాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచారు.

ఇదీ చదవండి: పర్వదినాల వేళ.. విజృంభిస్తే ఎలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.