తెలుగు లోగిళ్లలో మళ్లీ సీరియళ్ల సందడి ఆరంభం కానుంది. కరోనా నేపథ్యంలో కొంతకాలం నిలిచిపోయిన చిత్రీకరణలు మళ్లీ మొదలవడం వల్ల ఇంటింటా వినోదాన్ని పంచేందుకు ఈటీవీ అభిమాన తారాగణం విచ్చేస్తోంది. సోమవారం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, 2.30కు అత్తారింటికి దారేది, 3 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 3.30కు శ్రీమతి, రాత్రి 7గంటలకు అమ్మ, 7.30కు మనసు మమత, 8గంటలకు స్వాతి చినుకులు, 8.30కు నా పేరు మీనాక్షి సీరియళ్లు ప్రసారం కానున్నాయి. వీటితోపాటు రోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే షోలు కూడా వీక్షకులను అలరించనున్నాయి.
జెమినీలోనూ ఆరంభం
జెమినీ టీవీలో సోమవారం నుంచి సీరియళ్లు ప్రసారం కానున్నాయని సంస్థ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. బంధం, బృందావనం, బంగారు కోడలు, చి.ల.సౌ. స్రవంతి, మట్టిగాజులు సీరియళ్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు ప్రసారం కానున్నాయని తెలిపింది. సాయంత్రం ప్రైమ్ టైం మెగా సీరియళ్లు ఈ నెల 29 నుంచి ప్రసారమవుతాయని పేర్కొంది.
ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన