ETV Bharat / state

Kinnera Mogulaiah: 'కిన్నెర కళ అభివృద్ధికి ప్రభుత్వం సాయం చేయాలి'

Kinnera Mogulaiah: భీమ్లా నాయక్​ పాటతో గుర్తింపు తెచ్చుకున్న కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య.. మంత్రి గంగుల కమలాకర్​ను హైదరాబాద్​లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల.. మొగులయ్యను శాలువాతో సత్కరించి ఆర్థిక సాయం అందించారు. కళా, సాంస్కృతిక రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి అన్నారు.

Kinnera Mogulaiah meets minister Gangula
మంత్రి గంగులను కలిసిన మొగులయ్య
author img

By

Published : Dec 16, 2021, 1:30 PM IST

Kinnera Mogulaiah meets minister Gangula: పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, భీమ్లా నాయక్ పాటతో గుర్తింపు తెచ్చుకున్న మొగులయ్య.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అందిస్తున్న సహకారానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడమే తన జీవితాన్ని మార్చిందని చెప్పారు. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో తన కళను చేర్చినందుకు ప్రభుత్వానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు.

Kinnera Mogulaiah: రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. పదివేల రూపాయల కళాకారుల పింఛను ఇస్తున్నందుకు జీవితకాలం రుణపడి ఉంటానని మొగులయ్య అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్​ పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మొగులయ్య పాటను ఆలపించారు. కిన్నెర కళ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సాయం చేయాలని మంత్రిని కోరారు.

మొగులయ్యను శాలువాతో సత్కరించిన మంత్రి గంగుల కమలాకర్... ఆయను తక్షణ ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రభుత్వం కళా, సాంస్కృతిక రంగాలను నిరంతరం ప్రోత్సహిస్తుందని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

కేసీఆర్​ పాలనపై మొగులయ్య పాట

ఇదీ చదవండి: KTR on Warangal Tech Center: 'జెన్‌పాక్ట్ రాకతో వరంగల్‌ ఐటీ మరింత బలోపేతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.