ETV Bharat / state

Stunts on bike in hyderabad:​ రోడ్డుపై యువకుడి స్టంట్లు.. మరిచాడేమో ట్రాఫిక్​ రూల్సూ.! - young man stunts on sr nagar roads

Stunts on bike in hyderabad: కుర్రాళ్లకు బైక్​ ఇవ్వాలంటే తల్లిదండ్రులే కాదు.. తెలిసిన వాళ్లు కూడా భయపడతారు. అసలే ఉడుకు రక్తం, తొందరపాటు.. ముఖ్యంగా బైక్​పై ఉన్న మోజు.. ఆ మోజులో పడి.. చేతికి బండి చిక్కిందంటే చాలు.. విన్యాసాలు చేస్తుంటారు. అందరి కళ్లూ తమ వైపే ఉండాలనుకుంటారు. కానీ స్టంట్లు చేసే క్రమంలో కిందపడతామన్న భయం.. చేస్తున్నప్పుడు రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని గమనించకుండా కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆ కోవకు చెందిన వాడే ఈ వీడియోలో కనిపించే యువకుడు. తన చిత్రవిచిత్రమైన విన్యాసాలతో కాసేపు అక్కడున్న వారిని హడలెత్తించాడు.

man stunts on roads with bike
బైక్​పై యువకుడి ఫీట్లు
author img

By

Published : Dec 4, 2021, 8:50 PM IST

Stunts on bike in hyderabad: ట్రాఫిక్​ లేని రోడ్లపై స్టంట్లు చేస్తే ఏం కిక్కు ఉంటుంది అనుకున్నాడో ఏమో.. ఈ యువకుడు ఏకంగా హైదరాబాద్​ రోడ్లపై విన్యాసాలు ప్రదర్శించాడు. అసలే ఎస్​ఆర్​నగర్​ రోడ్డు.. దాదాపు 20 గంటలు వాహనదారులు, ప్రయాణికులతో బిజీగా ఉండే రహదారులు. కనీస వేగంతోనే వాహనదారులు ఆచితూచి నడుపుతుంటారు. అలాంటిది అతివేగంతో బండి నడుపుతూ బైక్​తో విన్యాసాలు చేశాడు ఈ యువకుడు. కాసేపు రోడ్డుపై ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఎస్ఆర్​ ​నగర్​ నుంచి వెంగళరావు నగర్​ వెళ్లే దారిలో ఈ యువకుడు చేసిన స్టంట్లు ఈటీవీ భారత్​ కెమెరాకు చిక్కాయి.

తాను వెళ్తున్న రోడ్డుపై వాహనాలు, పాదచారుల రద్దీ ఉన్నప్పటికీ ఆ యువకుడు ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడిపాడు. అంతే కాకుండా బైక్​ను కిందకు పైకి లేపుతూ స్టంట్స్‌ చేశాడు. కాసేపు అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ తోటి వాహనదారులను గందరగోళానికి గురిచేశాడు. యువకుడి ప్రవర్తనతో వాహనదారులు బెంబేలెత్తారు. తమనెక్కడ ఢీకొంటాడోననే భయంతో పాదచారులు వణికిపోయారు.

బైక్​పై యువకుడి ఫీట్లు

ఇదీ చదవండి: రేసింగ్‌లో దుమ్మురేపుతున్న చిన్నారులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.