ETV Bharat / state

Omicron: ఒమిక్రాన్​ కలవరం... ఫిబ్రవరిలో తారస్థాయికి చేరుతుందా? - omicron variant in telangana

Omicron: కరోనా కల్లోలం రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో కొత్త కలవరం మొదలైంది. దక్షిణాఫ్రికాలో మెుదలైన ఈ ప్రకంపనలు అన్ని దేశాల్లోనూ గుబులు రేపుతున్నాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటాయా..? మరణాలు ఎక్కువగా సంభవిస్తాయా..? అన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ... థర్డ్‌వేవ్‌కు ఇది ఆరంభమంటున్నారు... వైద్య నిపుణులు. రాబోయే 6 వారాలు అత్యంత కీలకమంటూ తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాసరావు చేసిన వాఖ్యలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో...జనాలు అప్రమత్తంగా ఉండాలి. మునుపటిలా మాస్క్‌లు, శానిటైజర్లతో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు....వైద్యనిపుణులు.

omicron
omicron
author img

By

Published : Dec 8, 2021, 12:39 PM IST

Omicron: ఫిబ్రవరి నెల 2021.. యావత్‌ ప్రపంచం ఫస్ట్‌వేవ్‌ అధిగమించి... వ్యాక్సిన్‌ అస్త్రాలతో ధైర్యంగా నిలబడిన సమయమది. కానీ, డెల్టా వేరింయట్‌ దెబ్బకు ప్రపంచ దేశాలు మళ్లీ చతికిలపడ్డాయి. జూన్‌ వరకు దారుణ పరిస్థితులు ఎదుర్కొంది. తరువాత... సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ అందింది. ఒక్కటి కాదు...రెండు డోసులు పూర్తైన వారు కొన్ని దేశాల్లో 70 శాతానికి పైగా ఉన్నారు. మన దేశంలోనూ 50శాతం చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక అంత సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో... ఒమిక్రాన్‌ కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెడుతోంది. ఈ వేరియంట్‌ ప్రభావం ఎంత వరకు ఉంటుందో ఇప్పుడే చెప్పలేకపోతున్నారు గానీ, కచ్చితంగా హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇంకా రాలేదని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే... పరోక్షంగా మరో వేవ్‌కు సిద్ధంగా ఉండాలనే సూచనలు చేస్తున్నారు.

లాక్​డౌన్​ ఉండే అవకాశం లేదు

omicron variant symptoms: ఇప్పటికే కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రెండు డోసులు టీకాలు తీసుకోని వారిని షాపింగ్‌ మాల్స్‌, జన సమూహాలు ఉండే ప్రాంతాలకు అనుమతించట్లేదు. అంటే...తొందర్లోనే లాక్‌డౌన్‌ వస్తుందేమో అన్న భయం జనాల్లో నెలకొంది. సోషల్‌ మీడియాలోనూ దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో.. తెలంగాణలో రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లు ఉండే అవకాశాలు లేవని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాదు... లాక్‌డౌన్‌ సమస్యకు పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.... రాష్ట్రంలో వచ్చే ఆరువారాలు అత్యంత కీలకమని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘ఒమిక్రాన్‌’తో రీఇన్ఫెక్షన్ల ముప్పు

omicron cases: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు నామమాత్రంగానే నమోదువుతున్నాయి. జనవరి 15 తరువాత ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. తెలంగాణలో నిర్వహిస్తున్న జ్వర సర్వే ద్వారా... ఇప్పటికే కోటి ఇళ్లను వైద్యసిబ్బంది ఆరేడుసార్లు సందర్శించారు. లక్షణాలున్న 8 లక్షల మందిని గుర్తించి కొవిడ్‌ చికిత్స కిట్లు అందజేశారు. ఈ విధానంతో డెల్టా వేరియంట్‌ సమయంలో కనీస నష్టంతో బయటపడ్డ విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. సింగపూర్‌ ఆరోగ్యశాఖ ఈ వేరియంట్‌పై మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది. గతంలో వెలుగుచూసిన కరోనా డెల్టా, బీటా వేరియంట్ల కంటే ‘ఒమిక్రాన్‌’తో రీఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండనుందని తెలిపింది. అంటే.. కరోనా నుంచి కోలుకున్నవారు కూడా ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్‌ బారిన పడే అవకాశాలూ ఎక్కువేనని అధ్యయనంలో తేలింది.

టీకాలు సమర్థంగా పనిచేస్తాయా? లేదా?

ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు సమర్థంగా పనిచేస్తాయా? లేదా? అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం..ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడం, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ప్రస్తుతమున్న టీకాలు బాగానే పనిచేస్తున్నాయని పలు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశాలతో ఒమిక్రాన్‌పై అభిప్రాయానికి రావడం సరికాదని, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

స్వీయజాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష

ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడం గానీ, మరణాలు కానీ నమోదు కాకపోవడం ఊరట నిచ్చే అంశం. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. అయినా అప్రమత్తంగా ఉండాలి. ఒమిక్రాన్‌ ఇప్పటికే చాలా దేశాలకు విస్తరించింది. మన దేశంలోనూ కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో... రెండు వేవ్‌ల నుంచి మనల్ని కాపాడిన స్వీయజాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అంటున్నారు... వైద్యనిపుణులు.

అత్యవసరమైతే తప్ప...

తొలి రెండు దశల కరోనా వ్యాప్తితో సతమతమైన ప్రజలు... మూడోదశ పొంచి ఉందని హెచ్చరిస్తున్నా... అప్రమత్తంగా ఉండటం లేదు. అత్యధిక రద్దీ ఉండే హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక.. ఆ స్వేచ్ఛకు కళ్లెం వేయాల్సిన సమయం ఆసన్నమైంది. మాస్క్‌ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు జరిమానా తెలంగాణలో ఇంకా అమలులో ఉన్నట్లు వైద్యరోగ్యశాఖ స్పష్టం చేసింది. మునుపటిలా అడుగు బయట పెట్టగానే మాస్క్ ధరించాలి. చాలా మంది మాస్క్‌ ముఖానికి తగిలించుకుని...గడ్డానికి రక్షణగా వాడుతున్నట్లు కనిపిస్తోంది. అది ఏ మాత్రం సురక్షితం కాదు. ఈ విధానం జరిమానాల నుంచి తప్పించవచ్చు గానీ, వైరస్‌ నుంచి కాదు. కాబట్టి... ముక్కు, మూతి కవర్‌ అయ్యేట్లు మాస్క్‌ ధరించాలి. శానిటైజర్‌ మళ్లీ వెంటపెట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. అత్యవసరమైతే తప్ప... వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందే.

వారికి ప్రమాదం తక్కువ

ఒమిక్రాన్‌ అయినా మరోటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు ఉంటుంది. పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారికీ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కొవిడ్‌ బారిన పడి రెండు టీకాలు వేయించుకున్నవారికి ఆ ప్రమాదం తక్కువ. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువ.

బూస్టర్ డోస్‌పై చర్చ

ఇదే సమయంలో... బూస్టర్ డోస్‌పై చర్చ నడుస్తోంది. పలు దేశాల్లో ఈ ప్రక్రియ మెుదలైంది. ప్రముఖ్య వైద్యనిపుణులూ బూస్టర్‌ డోస్‌ అవసరం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిగితా దేశాలతో పోల్చితే మనవి భిన్న పరిస్థితులు. మనదేశ జనాభా సుమారు 130 కోట్లు. ఇంకా అందరికి వ్యాక్సినేషన్‌ పూర్తి కాలేదు. రెండో డోసు చాలామంది వేయించుకోవాల్సి ఉంది. ఇది మన మొదటి ప్రాధాన్యం. తర్వాత 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాతే... బూస్టర్‌ డోసుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

థర్డ్‌వేవ్‌ వస్తుందా..?

థర్డ్‌వేవ్‌ వస్తుందా..? ఫిబ్రవరిలో తారస్థాయికి చేరుతుందా..? అన్న విషయాలు ఇప్పుడే చెప్పలేం కానీ, కరోనా వేరియంట్లు ఇప్పట్లో మనల్ని వదిలి వెళ్లవని స్పష్టమవుతోంది. ఈ వేరియంట్ల వల్ల లాక్‌డౌన్లు, ఉపాధి, ఆరోగ్యం ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నష్టపోయారు. గత అనుభవాల దృష్ట్యా... స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ..ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. 2020 మార్చి ముందు నాటి పరిస్థితులు మళ్లీ మనం చూడకపోవచ్చునని బ్రిటన్‌ సర్వేలో మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Omicron: ఒమిక్రాన్​ కలవరం... ఫిబ్రవరిలో తారస్థాయికి చేరుతుందా?

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.