బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ ఉదయం తుపానుగా మారి పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయ దిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 26న ఒడిశా, పశ్చిమ బంగ తీరాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావం వల్ల వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ మీదుగా కింది స్థాయి గాలులు వీస్తాయని వెల్లడించారు. ఈ సమయంలో రానున్న మూడు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..