ETV Bharat / state

Telangana News : టాప్​న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News
author img

By

Published : Jul 26, 2022, 9:00 PM IST

  • కామారెడ్డి వాసికి మంకీ పాక్స్ నెగెటివ్

Monkey Pox: రాష్ట్రంలో కలకలం సృష్టించిన మంకీ పాక్స్​ లక్షణాలు ఉన్న వ్యక్తికి నెగెటివ్​గా నిర్ధరణ అయింది. అతని నుంచి నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా నెగిటివ్‌గా నిర్ధరణ అయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • కేటీఆర్​ "వర్క్​ ఫ్రం హోం".. వాళ్లు చేసిన కామెంట్ల వల్లేనా..?

KTR Work From Home: మంత్రి కేటీఆర్​ వర్క్​ ఫ్రం హోం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కాలికి గాయం కావటంతో విశ్రాంతిలో ఉన్న మంత్రి.. క్షేత్రస్థాయికి వెళ్లలేకపోవటం వల్ల ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆయన ట్విటర్​ ఖాతాలో పంచుకున్నారు.

  • తడిసిముద్దవుతోన్న హైదరాబాద్​..

జోరువానలకు భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మోకాల్లోతు ప్రవాహంతో... ప్రభావిత కాలనీలవాసులు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. చెరువులకు వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

  • వణికిస్తోన్న వానలు.. స్తంభించిన జనజీవనం..

Heavy Rains in Telangana: రాష్ట్రంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలతో మరికొన్ని చోట్ల వరదల ఏకధాటిగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకే చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు అలుగులు పారుతుండగా.... వరదలు పోటెత్తుతున్నాయి.

  • రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో భారీ వానలు పడతాయని వెల్లడించింది. రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. గురువారం రోజున తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.

  • 11 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు

11 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వారందరిపై ఈమేరకు చర్యలకు తీర్మానించింది ఎగువసభ. వారం రోజులు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.

  • సోనియాను ఆరు గంటలు ప్రశ్నించిన ఈడీ..

నేషనల్ హెరాల్డ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను మంగళవారం ఆరు గంటల పాటు ఈడీ విచారించింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఈడీ.. మరోసారి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మరోవైపు, ఈ విచారణను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టిన రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి..

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైటెక్​సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. మృతుల్లో ఒకరివద్ద మద్యం సీసాలు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదం ఉదయం 8 గంటల సమయంలో జరిగినట్లు భావిస్తున్న పోలీసులు.. మూలమలుపులో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

  • కామన్‌వెల్త్ గేమ్స్​కు నీరజ్​ చోప్రా దూరం

కామన్‌వెల్త్ గేమ్స్​లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న నీరజ్​ చోప్రా.. ఈ మెగా పోటీలకు దూరం అయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనడం లేదు.

  • ఆ 8 అంశాలపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం

తెలుగు సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. అయితే, అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.