ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Dec 25, 2022, 12:59 PM IST

  • ఐదు రోజుల క్రితమే ఓ సినిమాలో నాన్న నటించారు.. ఇంతలోనే..

ఐదు రోజుల క్రితమే నాన్న ఓ సినిమాలో నటించారని చలపతిరావు కుమారుడు రవిబాబు తెలిపారు. ఆయనకు ఎన్టీఆర్‌, మంచి భోజనం, జోక్స్‌ అంటే ప్రాణమని చెప్పారు. ఎంతో అభిమానించే ఎన్టీఆర్‌తో సినిమాలు చేసే అదృష్టం తన తండ్రికి దక్కిందన్నారు.

  • వేరు వేరు ప్రమాదాల్లో నలుగురు యువకులు దుర్మరణం

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రో‌డ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. జీడిమెట్ల పరిధి గండిమైసమ్మ వద్ద అతివేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం.. రోడ్డు పక్కనే ఉన్న ఓ దుకాణం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది.

  • రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా మండలం చేగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో.. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

  • పరుగులో గెలిచి.. మృత్యువు చేతిలో ఓడిపోయాడు..

ఆ యువకుడు పోలీసు ఉద్యోగం కోసం ఎంతో శ్రమించాడు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు. ఈవెంట్స్​ కోసం నిరంతర సాధన చేశాడు. శనివారం నిర్వహించిన పరుగు పందెంలోనూ విజయం సాధించాడు. అయితే ఆ ఆనందం అనుభవించకుండానే అనంతలోకాలకు చేరాడు.

  • అరుదైన వ్యాధి.. అంతులేని వ్యథ

చూడడానికి బాగానే కనిపిస్తారు.. మంచంపై నుంచి కాలు కింద మోపలేరు.. చేతులు పైకెత్తలేరు.. దేనినీ పట్టుకోలేరు.. వారి పనులు వారు చేసుకోలేరు.. ఏ తోడు లేకుండా ఇంచు కూడా కదల్లేరు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. యుక్త వయసున్న పసి పిల్లలు వారు.

  • వాజ్​పేయీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి సహా ప్రముఖుల ఘన నివాళి

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన స్మారకం సదైవ్​ అటల్​ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సహా కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

  • అమెరికాలో మంచు తుపాను బీభత్సం

అమెరికా, కెనడాలకు మంచు తుపాను చుక్కలు చూపిస్తోంది. అత్యంత శీతలగాలలకు భారీగా మంచుగా కురవడం సహా ఎక్కడికక్కడ నీరు గడ్డకట్టిపోతోంది. మంచు, చలి తీవ్రతకు ఉష్ణోగ్రతలు మైనస్సుల్లోకి జారుకోగా దాదాపు 17 లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం.

  • ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • ఆదుకున్న శ్రేయస్​, అశ్విన్​..

బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్ చేసింది. మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో మూడు వికెట్ల తేడాతో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది.

  • 'దానవీర శూరకర్ణ'లో NTR మూడు పాత్రలు చేస్తే.. నేను ఐదు పాత్రలు చేశా'

సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు నెలకొన్నాయి. సహాయనటుడు, ప్రతినాయకుడిగా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన చలపతిరావు గతంలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.