ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

11AM TOPNEWS
11AM TOPNEWS
author img

By

Published : Dec 13, 2022, 10:56 AM IST

  • డ్రైవర్ పడుకున్నాడు... బస్సు పల్టీలు వేసింది..!

కుటుంబంలో పెద్ద వ్యక్తి సరిగ్గా లేనప్పుడు ఆ కుటుంబం అంత కష్టాలు అనుభవించవల్సి వస్తుంది. అలానే బస్సు ప్రయాణీకులు డ్రైవర్ పై నమ్మకం ఉంచి ప్రయాణం చేస్తారు. ఆ డ్రైవరే సరిగ్గా తన పని చేయకపోతే ఆ ప్రభావం తోటి ప్రయాణీకులు అందరి మీద పడుతుంది. అలాంటి సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఇంతకీ ఆ తప్పు ఏమిటంటే....

  • 3 నెలల క్రితం అదృశ్యం.. కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం..

చేతికందొచ్చిన కుమారుడు.. కుటుంబానికి అండగా ఉంటాడని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. చదువు పూర్తైతే చేదోడువాదోడుగా మారుతాడని భావించారు. కానీ అంతలోనే కనిపించకుండా పోయాడు. మూడు నెలలపాటు ఆచూకీ వెతకడంతో పాటు... పోలీసులు, ప్రజాప్రతినిధులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కుమారుడు ప్రాణాలతో వస్తాడనుకుంటే కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం దొరకడంతో తల్లడిల్లిపోతున్నారు.

  • పరిహారంలో హెచ్చుతగ్గులపై ఉదండపూర్ వాసుల ఆవేదన

రేకుల షెడ్డుకు 40లక్షల పరిహారం.. 6గదులు, ప్రహరీతో ఉన్న పక్కా ఇంటికి మాత్రం 13లక్షలే. భూసేకరణ ముందు లక్షలు వెచ్చించి నిర్మించుకున్న గృహాలకు.. ఇప్పుడిచ్చే పరిహారం చాలా తక్కువే. ఒకే కొలతలు, ఒకే నిర్మాణాలున్నా అధికారులు ప్రతిపాదించిన పరిహారంలో హెచ్చుతగ్గులున్నాయి. ఇళ్ల పరిహారంలో పాలమూరు జిల్లా ఉదండపూర్ గ్రామస్తుల ఆవేదనపై కథనం.

  • తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతులు.. ప్రభుత్వ భరోసా కోసం ఎదురు చూపులు

మాండౌస్‌ తుపాన్ వరి రైతులను నట్టేట ముంచింది. కోత సమయంలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఓ వైపు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం.. మరోవైపు కోతకు రాకుండానే పొలంలో వాలిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తమను ఉదారంగా ఆదుకోకపోతే.. సాగు ఆపేయడమే తమ ముందు కనిపిస్తున్న మార్గమని తేల్చిచెబుతున్నారు.

  • క్రోమ్‌లో నయా మోడ్స్‌.. ఇకపై మెమొరీ, పవర్​ రెండూ సేఫ్​..!

గూగుల్ క్రోమ్‌ సిస్టమ్‌ మెమొరీని ఎక్కువగా వాడుతుందనేది ఎక్కువ మంది యూజర్లు చెప్పేమాట. క్రోమ్‌లో బ్రౌజింగ్ చేస్తే సిస్టమ్‌ పనితీరు మందకొడిగా ఉంటుందని చెబుతుంటారు. అయితే ఓ తాజా అప్‌డేట్‌తో ఈ సమస్యలనన్నింటికి గూగుల్ చెక్‌ పెట్టనుంది.

  • 'మోదీని చంపేందుకు సిద్ధం కావాలి'.. వివాదాస్పద కాంగ్రెస్​ నేత పటేరియా అరెస్ట్

ప్రధానమంత్రి మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్​ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలన్నా మైనారిటీలు, దళితులు క్షేమంగా ఉండాలన్నా ప్రధాని మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • 'వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయ్‌ జాగ్రత్త!'.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ప్రస్తుత సీజన్‌లో కరోనాతోపాటు ఇతర రకాల వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ల వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు పౌరులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

  • వచ్చే వారం నుంచే ఇండియా-రష్యా వాణిజ్యం రూపాయల్లో

వచ్చే వారం నుంచే రష్యాతో వాణిజ్య చెల్లింపులు రూపాయల్లో జరగనున్నాయి. దేశం నుంచి ఔషధాలు, వాహన విడిభాగాలు దిగుమతి చేసుకునేందుకు రష్యా నుంచి డిమాండ్లు రావడమే ఇందుకు నేపథ్యం. దీంతో రష్యాతో భాతర వాణిజ్య లోటును తగ్గించేందుకు వీలవుతుంది.

  • కేరింత మూవీ భావన పెళ్లి అయిపోయిందోచ్​

సుకృతి అంటే గుర్తుపట్టడం కష్టం కానీ కేరింత సినిమాలో భావన అంటే చాలా మంది ఈజీగా గుర్తుపడతారు. ఆ సినిమాతో మంచి పేరు వచ్చినప్పటికీ ఆ తర్వాత తెరపై కనపడలేదు. కానీ సోషల్​మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దీంతో నెట్టింట ఫాలోవర్స్​ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను చూసేయండి.

  • టాలీవుడ్​ను షేక్​ చేసిన కొత్తందాలు.. 2022లో తెరపైకి నూతన నాయికలు

చిత్రసీమకి ఊపిరి కొత్తదనం. భవిష్యత్తు కొత్తతరం! మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా కథల్లోనూ, సాంకేతికతలోనూ, నటనలోనూ ఇలా అన్నిచోట్లా కొత్తదనం కనిపించాల్సిందే. కొత్తదనం అంటే కొత్తతరంతోనే సాధ్యం అని పరిశ్రమ నమ్మిన ప్రతిసారీ తెరపైన ఓ నవ తార మెరుస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.