ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

11AM TOPNEWS
11AM TOPNEWS
author img

By

Published : Dec 12, 2022, 10:57 AM IST

గోవా కేంద్రంగా మాదకద్రవ్యాలు రవాణా చేసే ఎడ్విన్‌ న్యూన్స్‌ పై... హైదరాబాద్‌ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. మత్తు పదార్ధాల సరఫరాలో ఎడ్విన్‌పై ఓయూ, రాంగోపాల్‌పేట్‌, లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లలో మూడుకేసులు నమోదయ్యాయి. గోవాలో పాగా వేసిన అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు.

  • ఉప్పల్‌ స్టేడియం వద్ద హైడ్రామా.. గేటు బయటే ఏజీఎం

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)కు జనవరి 10న ఎన్నికలు నిర్వహిస్తామని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్‌.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు జి.వినోద్‌, అర్షద్‌ అయూబ్‌ ప్రకటించారు.

  • ఆటోని ఢీకొట్టిన బస్సు.. దంపతుల మృతి, 11 మందికి గాయాలు

అప్పటివరకు వారంతా సంతోషంతో ఉన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అంతా కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఆటోలో ఇంటికి బయలుదేరారు. కానీ రోడ్డుపై చిన్న గుంత వారి ఆనందాలను ఆవిరి చేసింది. ఎదురుగా ఉన్న గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టారు. దీంతో ఆటోలో ఉన్న భార్యభర్త చనిపోగా 11 మంది గాయపడ్డారు.

  • చేతికొచ్చిన పంట వర్షార్పణం.. మాండౌస్ దెబ్బతో అల్లాడిపోయిన రైతాంగం..

పండించిన పంట తుపాను దెబ్బకు వర్షార్పణం కావడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు. ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసుంటే తమ కష్టం నీటిపాలు కాకుండా ఉండేదని వరి రైతులు వాపోతున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు..

  • హత్య కేసులో శిక్ష.. ఏడేళ్ల క్రితం 'చనిపోయిన' మహిళను తీసుకొచ్చిన నిర్దోషులు

సస్పెన్స్ థ్రిల్లర్​ను తలపించే ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. తప్పుడు కేసులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు నానా ప్రయత్నాలు చేసి తమను తాము నిర్దోషులుగా నిరూపించుకున్నారు. ఏడేళ్ల క్రితం చనిపోయిన యువతిని తిరిగి తీసుకొచ్చారు. అదెలా సాధ్యమైందంటే?

  • నిద్రలోనే భార్యాభర్తల దారుణ హత్య.. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో..

ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతోనే వీరిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  • ఆ ఇంట్లో వేలాది తేళ్లు.. లీటరు విషం 86 కోట్ల రూపాయలు

ఓ గదిలో వేలాది తేళ్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను ఆదివారం ట్విట్టర్​లో అప్​లోడ్​ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు.

  • కమల్​హాసన్​ను​ మించిన ఇమేజ్​ కోసం రజనీకాంత్​ అలా చేశారట!

రజనీకాంత్​, కమల్​హాసన్​.. భారత సినీ పరిశ్రమ దిగ్గజాలు. ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికి ఉన్న క్రేజే వేరు. ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అయితే అప్పట్లో కమల్​ను మించిన ఇమేజ్​ దక్కించుకోవడం కోసం రజనీ అలా చేశారట. ఆ సంగతులు...

  • రూ.9కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

హైదరాబాద్​లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా వద్ద 9కోట్లు విలువ చేసే 8కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

  • నర్సింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టిన లారీ

నల్గొండ జిల్లాలో నర్సింగ్ విద్యార్థినులు ప్రయాణిస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు.

  • మాదకద్రవ్యాల సరఫరా కేసు.. ఎడ్విన్‌ న్యూన్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు పీడీయాక్ట్

గోవా కేంద్రంగా మాదకద్రవ్యాలు రవాణా చేసే ఎడ్విన్‌ న్యూన్స్‌ పై... హైదరాబాద్‌ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. మత్తు పదార్ధాల సరఫరాలో ఎడ్విన్‌పై ఓయూ, రాంగోపాల్‌పేట్‌, లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లలో మూడుకేసులు నమోదయ్యాయి. గోవాలో పాగా వేసిన అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు.

  • ఉప్పల్‌ స్టేడియం వద్ద హైడ్రామా.. గేటు బయటే ఏజీఎం

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)కు జనవరి 10న ఎన్నికలు నిర్వహిస్తామని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్‌.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు జి.వినోద్‌, అర్షద్‌ అయూబ్‌ ప్రకటించారు.

  • ఆటోని ఢీకొట్టిన బస్సు.. దంపతుల మృతి, 11 మందికి గాయాలు

అప్పటివరకు వారంతా సంతోషంతో ఉన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అంతా కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఆటోలో ఇంటికి బయలుదేరారు. కానీ రోడ్డుపై చిన్న గుంత వారి ఆనందాలను ఆవిరి చేసింది. ఎదురుగా ఉన్న గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టారు. దీంతో ఆటోలో ఉన్న భార్యభర్త చనిపోగా 11 మంది గాయపడ్డారు.

  • చేతికొచ్చిన పంట వర్షార్పణం.. మాండౌస్ దెబ్బతో అల్లాడిపోయిన రైతాంగం..

పండించిన పంట తుపాను దెబ్బకు వర్షార్పణం కావడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు. ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసుంటే తమ కష్టం నీటిపాలు కాకుండా ఉండేదని వరి రైతులు వాపోతున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు..

  • హత్య కేసులో శిక్ష.. ఏడేళ్ల క్రితం 'చనిపోయిన' మహిళను తీసుకొచ్చిన నిర్దోషులు

సస్పెన్స్ థ్రిల్లర్​ను తలపించే ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. తప్పుడు కేసులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు నానా ప్రయత్నాలు చేసి తమను తాము నిర్దోషులుగా నిరూపించుకున్నారు. ఏడేళ్ల క్రితం చనిపోయిన యువతిని తిరిగి తీసుకొచ్చారు. అదెలా సాధ్యమైందంటే?

  • నిద్రలోనే భార్యాభర్తల దారుణ హత్య.. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో..

ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతోనే వీరిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  • ఆ ఇంట్లో వేలాది తేళ్లు.. లీటరు విషం 86 కోట్ల రూపాయలు

ఓ గదిలో వేలాది తేళ్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను ఆదివారం ట్విట్టర్​లో అప్​లోడ్​ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు.

  • కమల్​హాసన్​ను​ మించిన ఇమేజ్​ కోసం రజనీకాంత్​ అలా చేశారట!

రజనీకాంత్​, కమల్​హాసన్​.. భారత సినీ పరిశ్రమ దిగ్గజాలు. ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికి ఉన్న క్రేజే వేరు. ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అయితే అప్పట్లో కమల్​ను మించిన ఇమేజ్​ దక్కించుకోవడం కోసం రజనీ అలా చేశారట. ఆ సంగతులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.