ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @3PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News
author img

By

Published : Oct 27, 2022, 3:01 PM IST

  • 'తెరాసతో నందకుమార్‌కు సత్సంబంధాలు.. ఇవిగో సాక్ష్యాలు'

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని గ్రహించే తెరాస కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు. నందకుమార్‌కు కల్వకుంట్ల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. దానికి సంబంధించిన ఫొటోలు రిలీజ్ చేశారు.

  • 'కేసీఆర్ దమ్ముంటే యాదాద్రికి రా.. ప్రమాణం చేద్దాం'

రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుపై బండి సంజయ్ స్పందించారు. రేపు తాను యాదాద్రికి వెళ్తానని... కేసీఆర్‌కు దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఉదయం 9 గంటలకల్లా వచ్చి లక్ష్మీనరసింహ స్వామిపై ప్రమాణం చేద్దాం అని చెప్పారు.

  • ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళనకు దిగిన భాజపా శ్రేణులు

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి. మొయినాబాద్ ఘటనపై రెండు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేగుతుంది... తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు నిప్పులు కక్కుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలో పలుచోట్ల భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు.

  • 'జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక.. భాజపా, తెరాస ఈ నాటకానికి తెరతీశాయి'

మొయినాబాద్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక.. దానిని పక్కదారి పట్టించేందుకు భాజపా, తెరాస కలిసి ఈ నాటకానికి తెరతీశాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు.

  • నిందితులపై కేసు.. FIR కాపీలో కీలక విషయాలు

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు పొందుపర్చారు. తెరాస ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

  • ఆర్థిక మాంద్యం భయం.. ఐటీ నియామకాలు ఆగమాగం

ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ఉన్న నియామకాల జోరు.. ప్రస్తుతం కనపడటం లేదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు.. నియామకాలు, ఉద్యోగాల సంఖ్యపై ప్రభావం చూపుతున్నాయి.

  • 'ఉచిత విద్యుత్ అనేది సంక్షేమం కాదు'.. ఎన్నికల్లో వాగ్దానాలపై ఈసీకి భాజపా లేఖ

ఉచిత పథకాలు, వాటి సాధ్యాసాధ్యాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. ఉచితాలపై ప్రజలు ఆధారపడేటట్లు చేయడం సరికాదని, బదులుగా ఓటరు చైతన్యంపై రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాలని పేర్కొంది.

  • భోపాల్​లో గ్యాస్ లీక్.. ఏడుగురికి అస్వస్థత.. ఇళ్ల నుంచి జనం పరుగులు!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​లో గ్యాస్ లీకై.. ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంటులోని సిలిండర్ నుంచి క్లోరిన్ లీక్ అయిందని అధికారులు తెలిపారు.

  • రోహిత్​ ఆన్​​ ఫైర్​.. రాహుల్ మళ్లీ ఫెయిల్.. కోహ్లీ సూపర్​

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. అదిరిపోయే ఇన్నింగ్స్​ ఆడాడు. కోహ్లీ తన దూకుడును కొనసాగించాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం నిరాశపరిచాడు.

  • ఆ నెంబర్​ చుట్టూ విజయ్​ 'వారిసు'​.. మహేశ్​బాబు​ ఫుల్​ ఖుష్​

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌- దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'వారిసు'. దిల్‌ రాజు నిర్మాత. ఇదే చిత్రాన్ని 'వారసుడు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.