ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM - Telangana Top News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News: టాప్​న్యూస్ @9AM
Telangana Top News: టాప్​న్యూస్ @9AM
author img

By

Published : Oct 26, 2022, 9:09 AM IST

మునుగోడు ప్రచారానికి మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీపావళి పండుగతో కాస్త విరామం తీసుకున్న నేతలు.. మళ్లీ రంగంలోకి దిగనున్నారు. అధికార పక్షం ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్లలో నిమగ్నం అయ్యింది. భాజపా నడ్డా సభ కోసం.. కాంగ్రెస్‌ రాహుల్‌ జోడో యాత్రతో కాక పుట్టించేందుకు పావులు కదుపుతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న సమాచారంతో ఆయా సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు పెంచారు.

  • గోదావరి-కావేరీ అనుసంధానంపై మరోసారి చర్చ

NWDA Meeting: గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వచ్చే నెల 15న జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) మరోసారి చర్చించనుంది. ఆ సంస్థ 70వ సర్వసభ్య సమావేశం దిల్లీలో జరగనుంది. భాగస్వామ్య రాష్ట్రాలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తుండగా.. ఎజెండాలో కీలకాంశంగా గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు ఉంది.

  • నగరంలో సందడిగా సదర్​ ఉత్సవాలు..

Sadar Celebrations in Hyderabad: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలు.. భాగ్యనగరంలో సందడిగా సాగుతున్నాయి. వేడుకల కోసం హర్యానా నుంచి దున్నరాజులను నిర్వాహకులు తెప్పించారు. దీపావళి అనంతరం.. యాదవ్ సోదరులు ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో రూ.35 కోట్ల గరుడ మేలు జాతి దున్నరాజు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

  • సంక్రాంతికి అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన..

అయోధ్యలోని రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు సగం పనులు పూర్తి కాగా.. 2024 జనవరికల్లా రామమందిరాన్ని భక్తుల సందర్శనార్థం ప్రారంభిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

  • అత్యంత మురికి మనిషి కన్నుమూత..

ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి అని పేరొందిన అమౌ హజీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. సుమారు 60 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కసారి ఆయన స్నానం చేశారు.

  • 'మేమూ పరీక్షలు చేస్తాం'..

వైద్య సేవల రంగంలో ఆరోగ్య పరీక్షల విభాగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అపోలో, అదానీ, రిలయన్స్‌, టాటా 1ఎంజీ వంటి సంస్థలు.. ఇందులో అడుగుపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా తమ నెట్​వర్క్​ను విస్తరించేందుకు ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

  • కోహ్లీ కోసం తూటానైనా ఎదుర్కొనేవాడిని..

విరాట్ కోహ్లీని ఔట్ కానివ్వకుండా ఉండేందుకు తాను తూటానైనా ఎదుర్కొనేవాడినని టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో కోహ్లీ కంటే సమర్థుడు మరొకరు లేరని పొగిడాడు.

  • ధనుష్‌ చిత్రంలో శివరాజ్​కుమార్​!

'జల్లికట్టు'తో సంచలనం విజయం అందుకున్న దర్శకుడు లిజో జోస్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్టు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ మంగళవారం ప్రకటించారు. మరోవైపు ధనుష్​ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ నటించారు. ఇలాంటి మరిన్ని లేటస్ట్​ మూవీ అప్డేట్స్​ మీ కోసం..

  • అమెరికాలో రోడ్డుప్రమాదం.. నలుగురు తెలుగువాసులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాను, ట్రక్కు ఢీకొని నలుగురు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

  • అందుబాటులోకి నాగోల్‌ ఫ్లైఓవర్‌..

Minister KTR to inaugurate Nagole flyover: నాగోల్ ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించనున్నారు. రూ.143 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను జీహెచ్​ఎంసీ నిర్మించింది. దాదాపు కిలోమీటర్ పొడవు ఉండే నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చేరుకోవచ్చు.

  • పతాక స్థాయికి ప్రచారం..

మునుగోడు ప్రచారానికి మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీపావళి పండుగతో కాస్త విరామం తీసుకున్న నేతలు.. మళ్లీ రంగంలోకి దిగనున్నారు. అధికార పక్షం ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్లలో నిమగ్నం అయ్యింది. భాజపా నడ్డా సభ కోసం.. కాంగ్రెస్‌ రాహుల్‌ జోడో యాత్రతో కాక పుట్టించేందుకు పావులు కదుపుతున్నారు. ఇక క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న సమాచారంతో ఆయా సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు పెంచారు.

  • గోదావరి-కావేరీ అనుసంధానంపై మరోసారి చర్చ

NWDA Meeting: గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వచ్చే నెల 15న జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) మరోసారి చర్చించనుంది. ఆ సంస్థ 70వ సర్వసభ్య సమావేశం దిల్లీలో జరగనుంది. భాగస్వామ్య రాష్ట్రాలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తుండగా.. ఎజెండాలో కీలకాంశంగా గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు ఉంది.

  • నగరంలో సందడిగా సదర్​ ఉత్సవాలు..

Sadar Celebrations in Hyderabad: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలు.. భాగ్యనగరంలో సందడిగా సాగుతున్నాయి. వేడుకల కోసం హర్యానా నుంచి దున్నరాజులను నిర్వాహకులు తెప్పించారు. దీపావళి అనంతరం.. యాదవ్ సోదరులు ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో రూ.35 కోట్ల గరుడ మేలు జాతి దున్నరాజు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

  • సంక్రాంతికి అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన..

అయోధ్యలోని రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు సగం పనులు పూర్తి కాగా.. 2024 జనవరికల్లా రామమందిరాన్ని భక్తుల సందర్శనార్థం ప్రారంభిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

  • అత్యంత మురికి మనిషి కన్నుమూత..

ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి అని పేరొందిన అమౌ హజీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. సుమారు 60 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కసారి ఆయన స్నానం చేశారు.

  • 'మేమూ పరీక్షలు చేస్తాం'..

వైద్య సేవల రంగంలో ఆరోగ్య పరీక్షల విభాగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అపోలో, అదానీ, రిలయన్స్‌, టాటా 1ఎంజీ వంటి సంస్థలు.. ఇందులో అడుగుపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా తమ నెట్​వర్క్​ను విస్తరించేందుకు ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

  • కోహ్లీ కోసం తూటానైనా ఎదుర్కొనేవాడిని..

విరాట్ కోహ్లీని ఔట్ కానివ్వకుండా ఉండేందుకు తాను తూటానైనా ఎదుర్కొనేవాడినని టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో కోహ్లీ కంటే సమర్థుడు మరొకరు లేరని పొగిడాడు.

  • ధనుష్‌ చిత్రంలో శివరాజ్​కుమార్​!

'జల్లికట్టు'తో సంచలనం విజయం అందుకున్న దర్శకుడు లిజో జోస్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్టు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ మంగళవారం ప్రకటించారు. మరోవైపు ధనుష్​ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ నటించారు. ఇలాంటి మరిన్ని లేటస్ట్​ మూవీ అప్డేట్స్​ మీ కోసం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.