ETV Bharat / state

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల్లో తెలంగాణ టాప్‌

author img

By

Published : Oct 23, 2019, 9:28 AM IST

మహిళలపై నేరాలు పెరుగుతున్నట్లు జాతీయ నేర గణాంకాల మండలి-2017 నివేదిక వెల్లడించింది. 2016తో పోలిస్తే 2017 సంవత్సరంలో 3.6శాతం నేరాలు పెరిగినట్లు నివేదిక చెబుతోంది. పని ప్రదేశంలో మహిళలపై వేధింపుల అంశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మానవ అక్రమ రవాణాలోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి.

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల్లో తెలంగాణ టాప్‌

జాతీయ నేర గణాంకాల మండలి-2017 నివేదిక పలు నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 50లక్షల 7వేలకు పైగా ఐపీసీ కేసులు 19లక్షల 44వేలకు పైగా స్థానిక చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. 2016తో పోలిస్తే కేసుల నమోదులో 3.6శాతం మేర పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా 2017లో మహిళలపై నేరాలు పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల మండలి తేల్చింది.

telangana-top-in-the-list-of-workplace-women-harassment
దేశవ్యాప్తంగా, తెలంగాణలో నమోదైన కేసులు

తెలంగాణే టాప్​

తెలంగాణలోనూ 2016తో పోలిస్తే 2017లో పెరిగాయి. 2015లో 15425, 2016లో 15374 కేసులు నమోదు కాగా 2017లో మాత్రం 17521 కేసులు నమోదు కావడం గమనార్హం. మహిళలపై నేరాల విషయంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 56వేల కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. పని ప్రదేశంలో మహిళలపై వేదింపుల విషయంలో తెలంగాణ టాప్​లో ఉంది. దేశవ్యాప్తంగా 449 కేసులు నమోదు కాగా తెలంగాణలో 123 కేసులు నమోదయ్యాయి. మహిళలను అక్రమ రవాణా చేసి అనంతరం వ్యభిచార వృత్తికి దింపుతున్న ఘటనల్లో 184 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.

telangana-top-in-the-list-of-workplace-women-harassment
తెలంగాణ నేర వార్తలు

రాష్ట్రంలోనే 90శాతానికి పైగా కేసులు

చిన్నారులపై నేరాలకు సంబంధించి 2017లో తెలంగాణలో 3580 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు 10840 నమోదయ్యాయి. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు 1209 నమోదయ్యాయి. 2016తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ సైబర్ క్రైం కేసులు నమోదు కావడం గమనార్హం. ఆహార కల్తీ విషయంలో తెలంగాణలో 2009 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 2588 కేసులు నమోదు కాగా రాష్ట్రంలోనే 90శాతానికి పైగా కేసులుంటుండటాన్ని బట్టి చూస్తే కల్తీ వస్తువుల నియంత్రణంలో రాష్ట్రం ముందుంది.

2018లో రాష్ట్ర పోలీసులు రూపొందించిన వార్షిక నివేదిక ప్రకారం మహిళలపై నేరాలు 7శాతానికి తగ్గాయి. ఇతర నేరాలు కూడా 5శాతం తగ్గినట్లు రాష్ట్ర పోలీసుల వార్షిక నివేదిక చెబుతోంది.

ఈ కథనం చదవండి: నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం

TG_HYD_03_23_NCRB_REPORT_PKG_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) మహిళలపై నేరాలు పెరుగుతున్నట్లు జాతీయ నేర గణాంకాల మండలి-2017 నివేదిక వెల్లడించింది. రెండేళ్లు ఆలస్యంగా విడుదలైన నివేదికలో పలు నేరాలకు సంబంధించిన వివరాలు పొందుపర్చారు. 2016తో పోలిస్తే 2017 సంవత్సరంలో 3.6శాతం నేరాలు పెరిగినట్లు నివేదిక చెబుతోంది. దేశ వ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 3లక్షల 59వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మహిళలపై నేరాలకు సంబంధించి 17వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పని ప్రదేశంలో మహిళలపై వేదింపుల అంశంలో తెలంగాణ టాప్ లో ఉంది. మానవ అక్రమ రవాణాలోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి......LOOK V.O- జాతీయ నేర గణాంకాల మండలి-2017 నివేదిక పలు నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 50లక్షల 7వేలకు పైగా ఐపీసీ కేసులు 19లక్షల 44వేలకు పైగా స్థానిక చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. 2016తో పోలిస్తే కేసుల నమోదులో 3.6శాతం మేర పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా 2017లో మహిళలపై నేరాలు పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల మండలి తేల్చింది. తెలంగాణలోనూ 2016తో పోలిస్తే 2017లో పెరిగాయి. 2015లో 15425, 2016లో 15374 కేసులు నమోదు కాగా 2017లో మాత్రం 17521 కేసులు నమోదు కావడం గమనార్హం. మహిళలపై నేరాల విషయంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 56వేల కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. పని ప్రదేశంలో మహిళలపై వేదింపుల విషయంలో తెలంగాణ టాప్ లో ఉంది. దేశవ్యాప్తంగా 449 కేసులు నమోదు కాగా తెలంగాణలో 123 కేసులు నమోదయ్యాయి. మహిళలను అక్రమ రవాణా చేసి అనంతరం వ్యభిచారంవృత్తికి దింపుతున్న ఘటనల్లో 184 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. V.O- చిన్నారులపై నేరాలకు సంబంధించి 2017లో తెలంగాణలో 3580 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు 10840 నమోదయ్యాయి. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు 1209 నమోదయ్యాయి. 2016తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ సైబర్ క్రైం కేసులు నమోదు కావడం గమనార్హం. ఆహార కల్తీ విషయంలో తెలంగాణలో 2009 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 2588 కేసులు నమోదు కాగా రాష్ట్రంలోనే 90శాతానికి పైగా కేసులుంటుండటాన్ని బట్టి చూస్తే కల్తీ వస్తువుల నియంత్రణంలో రాష్ట్రం ముందుంది. E.V.O- 2018లో రాష్ట్ర పోలీసులు రూపొందించిన వార్షిక నివేదిక ప్రకారం మహిళలపై నేరాలు 7శాతానికి తగ్గాయి. ఇతర నేరాలు కూడా 5శాతం తగ్గినట్లు రాష్ట్ర పోలీసుల వార్షిక నివేదిక చెబుతోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.