తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2022 ప్రాథమిక సమాధానాలు విడుదల అయింది. tstet.cgg.gov.inలో టెట్ ప్రాథమిక కీ ఉన్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. సమాధానాలపై అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. జూన్ 18లోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు. కాగా టెట్ పరీక్ష ఈనెల 12న నిర్వహించారు. టెట్‌కు 90శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి: