రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ప్రకటించింది. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాతుందని తెలిపింది. భద్రాద్రి, జయశంకర్, ములుగు, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.
ఇవాళ ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఇవాళ ఉపరితల ఆవర్తన ద్రోణి జార్ఖండ్ పరసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదగా దక్షిణ కోస్తాంధ్రా వరకు సముద్ర మట్టానికి 1.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది.
ఉత్తర, ఈశాన్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
రేపు, ఎల్లుండి ఈ తీవ్రత తగ్గినప్పటికీ... 27, 28న మళ్లీ ఈ ద్రోణి ప్రభావం మళ్లీ తెలంగాణపై ఉండటం వల్ల ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుందని నాగరత్న పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Warning : భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక... సీడబ్ల్యూసీ కీలక సూచన