ETV Bharat / state

తెలంగాణ రాష్ట్ర గణాంక సంకలనం-2020 విడుదల

రైతుబంధు లబ్ధిదారుల్లో చిన్న రైతులే ఎక్కువని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర గణాంక సంకలనం విడుదల చేసిన సర్కారు... అందులో కీలక అంశాలన్ని ప్రస్తావించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నదాతల్లో 70 శాతం మందికి... రైతుబంధు అందినట్లు పేర్కొంది. వంద శాతం ఆవాసాలకు మిషన్‌భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నట్లు తెలిపింది.

telangana state statistical abstract released
తెలంగాణ రాష్ట్ర గణాంక సంకలనం-2020 విడుదల
author img

By

Published : Oct 28, 2020, 5:20 AM IST

తెలంగాణ రాష్ట్ర గణాంక సంకలనం-2020 విడుదల

రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించిన తెలంగాణ గణాంక సంకలనం-2020 పుస్తకాన్ని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, ప్రభుత్వ పథకాలు, పలు సర్వే గణాంకాలను వెల్లడించారు. గణాంక సంకలనంలో రైతుబంధు, రైతుబీమా వివరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2020 వానాకాలంలో రైతుబంధు కింద 57 లక్షల 81 వేల 888 మంది రైతులకు 7 వేల 270 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు వివరించారు. లబ్ధిదారుల్లో బీసీలు 53 శాతం, ఎస్సీ, ఎస్టీలు 13 శాతం, ఇతరులు 21శాతంగా ఉన్నట్లు వివరించారు. నల్గొండ జిల్లా రైతులకు అత్యధికంగా రైతుబంధు సాయం అందగా.. మేడ్చల్‌లో అతితక్కువ సాయం అందింది.

897 రైతు కుటుంబాలకు..

రైతుబీమా కింద 2018-19, 2019-20లో 36 వేల 897 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున.. మెుత్తం 1,844 కోట్ల పరిహరం అందించారు. పరిహారం పొందిన రైతుల్లో బీసీలు 51శాతం, ఎస్సీలు 19 శాతం , ఎస్టీలు 14 శాతం, మైనార్టీలు ఒక శాతం, ఇతరులు 15 శాతం ఉన్నారు. రైతుబీమా పరిహారం ఎక్కువగా వచ్చిన జిల్లాల్లోనూ నల్గొండ మొదటి స్థానంలో నిలిచింది.

ఆయకట్టుకు సాగునీరు

మరోవైపు 33 భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 89 లక్షల 30వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికిగాను.. ఇప్పటి వరకు 36 లక్షల 68 వేల ఆయకట్టుకు నీరు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. 37 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 4 లక్షల ఆయకట్టు ఉండగా.. కొత్తగా 3 లక్షల 63 వేల ఆయకట్టు సృష్టించినట్లు వివరించింది. 636 ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు, 44 వేల చెరువుల ద్వారా 18 లక్షల 44 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు వెల్లడించింది.

అన్ని ఆవాసాలకు భగీరథ..

గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం ఆవాసాలు అన్నింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు అందుతున్నాయని తెలిపింది. ఈ పథకం ద్వారా 2.08 కోట్ల మంది లబ్ధి పొందినట్లు తెలంగాణ గణాంక సంకలనంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 వేల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అందులో 1 శాతం పిల్లల్లో తీవ్రత ఎక్కువగా ఉందని.. 15.50 శాతం వారిలో మధ్యస్థంగా ఉందని తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 18వేల మంది పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.