ఎంసెట్, ఈసెట్, ఐసెట్ లకు కొత్త కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్ టీయూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ ఎ.గోవర్దన్ నియమితులయ్యారు. గోవర్దన్ గతంలో ఈసెట్ కన్వీనర్ గా చేశారు. ఈసెట్ కన్వీనర్‌గా జేఎన్ టీయూహెచ్ ప్రవేశాల సంచాలకుడు ఎం.మంజూర్ హుస్సేన్ నియమితులయ్యారు.
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఐసెట్ కన్వీనర్‌గా కాకతీయ యూనివర్సిటీ కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డిని ఉన్నత విద్యా మండలి నియమించింది. పీఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, లాసెట్, పీజీఎల్ సెట్ కన్వీనర్‌గా జీబీరెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ కుమార్, ఎడ్ సెట్ కన్వీనర్‌గా మృణాళినిని ఉన్నత విద్యా మండలి నియమించింది.
ఇవీ చూడండి:ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం