ETV Bharat / state

వస్తువులిక సురక్షితం: ఆర్టీసీలో పార్శిల్​ సర్వీసులకు మార్గం సుగమం - telangana latest news

తెలంగాణ ఆర్టీసీ టిక్కెట్టేతర ఆదాయంపై దృష్టి సారించింది. ఇప్పటికే కార్గో సేవలు ప్రారంభించిన రవాణా సంస్థ. ఇప్పుడు పార్శిల్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. శుక్రవారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ పార్శిల్ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

telangana rtc started parcel services
పార్శిల్​ సర్వీలను అందుబాటులోకి తేనున్న ఆర్టీసీ
author img

By

Published : Jun 18, 2020, 12:20 PM IST

Updated : Jun 18, 2020, 12:54 PM IST

లాక్​డౌన్​లో ఆర్టీసీ కార్గో సేవలను అట్టహాసంగా ప్రారంభించింది. ప్రస్తుతం 94 కార్గో బస్సులతో ఆర్టీసీ సేవలను అందిస్తోంది. టీఎస్ ఫుడ్స్, సీడ్స్, వ్యవసాయ శాఖకు కార్గో బస్సులను నడుపుతోంది. ఇంకా పౌర సరఫరా శాఖకు, బేవరేజేస్​కు కూడా నడపాలని చూస్తోంది. మరో 100 కార్గో బస్సులు సిద్ధమవుతున్నాయి. అన్నీ అందుబాటులోకి వస్తే.. సుమారు 200 కార్గో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే కార్గో బస్సులతో ఆర్టీసీకి రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.

ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్​లు ఉన్నాయి. సమర్థవంతమైన యంత్రాంగం, అధికారులు ఉన్నారు. వీటిని సమృద్ధిగా వినియోగించుకుంటే పార్శిల్ సేవలను సైతం విజయవంతంగా నడిపించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. పార్శిల్ సేవలకు సంబంధించిన విధివిధానాలకు ఆరు మంది సభ్యులతో ఓ కమిటీని వేశారు. పార్శిల్‌ ధరలు, సిబ్బంది నియామకం వంటి ఇతర అంశాలను కమిటీ నిర్ణయిస్తుంది. ఇప్పటికే హకీంపేట్‌లోని RTC కేంద్రంలో... మార్కెటింగ్‌ సిబ్బందికి.... బుకింగ్‌, డెలివరీపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు 140 బస్టాండ్లను గుర్తించారు.

అన్ని బస్సుల్లోనూ..

ఆర్టీసీ ఆర్డినరీ, డీలక్స్, సూపర్ లక్జరీ, గరుడ బస్సుల్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని పార్శిల్ సేవలకు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఎంజీబీఎస్, జేబీఎస్, నిజామాబాద్, కరీంనగర్, సూర్యాపేట తదితర రద్దీగా ఉండే బస్టాండ్లను గుర్తించారు. ఇప్పటికే ప్రజా రవాణాను విజయవంతంగా నడిపిస్తున్న ఆర్టీసీ... కార్గో, పార్శిల్ సేవలను కూడా విజయవంతంగా నడిపిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్​ అదిరిందమ్మా!

Last Updated : Jun 18, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.