ETV Bharat / state

మద్యపానంతో రోడ్డు ప్రమాదాలు.. మూడో స్థానంలో తెలంగాణ

Telangana ranks third in road accidents: మద్యపానం తాగి... వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదికలో తేలింది. అయితే తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో దేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana ranks third in road accidents due to alcohol
మద్యపానంతో రోడ్డు ప్రమాదాలు.. మూడో స్థానంలో తెలంగాణ
author img

By

Published : Dec 31, 2022, 7:53 AM IST

Telangana ranks third in road accidents రాష్ట్రంలో మద్యం అమ్మకాలే కాదు.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, తద్వారా మరణాలూ పెరుగుతూనే ఉన్నాయి. తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో దేశంలో తెలంగాణ 3వ స్థానంలో, మరణాల్లో రెండో స్థానంలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఇంకా అనేక అంశాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి పదిస్థానాల్లో ఉంది. జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ 2021 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.

  • మద్యపానం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ (1487) దేశంలో 3వ స్థానం, 339 మరణాలతో రెండో స్థానం, 1404 క్షతగాత్రులతో మూడోస్థానంలో ఉంది.
  • మితిమీరిన వేగం కారణంగా 17,386 ప్రమాదాలతో 6వ స్థానం, 6638 మరణాలతో 8వ స్థానంలో ఉంది.
  • హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతూ 2351 మంది చనిపోగా.. ఈ విషయంలో రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది. వెనక కూర్చుని హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్ల 815 మంది చనిపోయారు. ఈ అంశంలో 8వ స్థానంలో ఉంది.
  • వాహనం బోల్తా పడటం వల్ల జరిగిన 1261 ప్రమాదాలతో రాష్ట్రం 4వ స్థానం, ఎదురెదురుగా ఢీకొట్టడం వల్ల సంభవించిన 6022 ప్రమాదాలతో 5వ స్థానంలో ఉంది.
  • రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 25-35 ఏళ్ల మధ్య వయసువారే అత్యధికంగా 2224 మంది చనిపోయారు. మొత్తం 7557 మరణాల్లో వీరి సంఖ్య సుమారు మూడోవంతు.

బ్లాక్‌స్పాట్లలో 4వ స్థానం.. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల (బ్లాక్‌స్పాట్ల) విషయంలో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. తమిళనాడులో అత్యధికంగా 748 బ్లాక్‌స్పాట్లు ఉండగా తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌ (701), కర్ణాటక (551), తెలంగాణ (485), ఆంధ్రప్రదేశ్‌ (466) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కూడళ్లలో ప్రమాదాలు హైదరాబాద్‌లోనే అధికం

* నగరాల కేటగిరీలో హైదరాబాద్‌ అన్ని రకాలు కలిపి 2,273 ప్రమాదాలతో 8వ స్థానంలో, 295 మరణాలతో 19వ స్థానంలో ఉంది. మెట్రో నగరాల్లో కూడళ్లు సరిగా లేకపోవడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌దే ప్రథమస్థానం. దేశవ్యాప్తంగా ఇలా 3544 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. ఒక్క హైదరాబాద్‌లోనే 1050 నమోదు కావడం గమనార్హం. రెండోస్థానంలో నిలిచిన జబల్‌పూర్‌లో ఈ సంఖ్య కేవలం 390. ఇలాంటి ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 840 మంది మరణిస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 133 మంది చనిపోయారు.

* టి జంక్షన్స్‌ వద్ద 2474 ప్రమాదాలతో తెలంగాణ 6వ స్థానం, 6,864 మరణాలతో 4వ స్థానంలో ఉంది.

* వాహనం అదుపు తప్పడం వల్ల 6971 ప్రమాదాలతో నాలుగో స్థానం, 2167 మరణాలతో 3వ స్థానంలో ఉంది.

* లైసెన్సు లేకుండా వాహనం నడపడం వల్ల జరిగిన 1317 ప్రమాదాలతో రాష్ట్రానిది 8వ స్థానం.

* రోడ్ల మీద గుంతల వల్ల జరిగిన ప్రమాదాల్లో 29 మంది మరణించగా ఇందులో రాష్ట్రం 8వ స్థానంలో ఉంది.

* కొనుగోలు చేసిన తర్వాత అయిదేళ్లలోపు వాహనాల వల్ల 9428 ప్రమాదాలతో 5, 3254 మరణాలతో 6వ స్థానం.

* 4082 మంది ద్విచక్ర వాహనదారుల మరణాలతో 8వ స్థానం.

* జాతీయ రహదారులపై 7,214 ప్రమాదాలతో తెలంగాణ 8వ స్థానం, 2,735 మరణాలతో 9వ స్థానంలో ఉంది.

* దేశంలో అత్యధికంగా జనవరి నెలలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది జనవరిలో 40,305 ప్రమాదాలు నమోదయ్యాయి. తర్వాత మార్చి నెలలో 39,491 జరిగాయి.

* రోజు మొత్తంలో అత్యధికంగా అంటే 20.7 శాతం ప్రమాదాలు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే జరిగాయి. తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య 17.8 శాతం ప్రమాదాలు జరిగాయి.

* ట్రాఫిక్‌ పోలీసుల నియంత్రణలో ఉన్న కూడళ్ల వద్ద జరిగిన ప్రమాదాల్లో విజయవాడ, హైదరాబాద్‌, వైజాగ్‌లు 2, 4, 6 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా ప్రమాదాలు 2595 జరిగితే.. కొచ్చిలో అత్యధికంగా 422 నమోదయ్యాయి. విజయవాడలో 358, చెన్నైలో 191, హైదరాబాద్‌లో 180, బెంగళూరులో 153, వైజాగ్‌లో 144 జరిగాయి.

* పోలీసుల నియంత్రణలో లేని కూడళ్లలో జరిగిన ప్రమాదాల్లో హైదరాబాద్‌ది రెండో స్థానం. జబల్‌పూర్‌లో అత్యధికంగా 3855 ప్రమాదాలు జరిగితే.. హైదరాబాద్‌లో 1765 చోటుచేసుకున్నాయి.

కూడళ్లలో ప్రమాదాలు హైదరాబాద్‌లోనే అధికం... నగరాల కేటగిరీలో హైదరాబాద్‌ అన్ని రకాలు కలిపి 2,273 ప్రమాదాలతో 8వ స్థానంలో, 295 మరణాలతో 19వ స్థానంలో ఉంది. మెట్రో నగరాల్లో కూడళ్లు సరిగా లేకపోవడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌దే ప్రథమస్థానం. దేశవ్యాప్తంగా ఇలా 3544 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. ఒక్క హైదరాబాద్‌లోనే 1050 నమోదు కావడం గమనార్హం. రెండోస్థానంలో నిలిచిన జబల్‌పూర్‌లో ఈ సంఖ్య కేవలం 390. ఇలాంటి ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 840 మంది మరణిస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 133 మంది చనిపోయారు.

ఇవీ చదవండి: 1,365 పోస్టులతో గ్రూప్- 3 నోటిఫికేషన్ విడుదల

5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

'కులం వద్దు.. వర్గం వద్దు'.. ప్రభుత్వ బడులపై సర్కార్​ కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.