ETV Bharat / state

ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు - TS MLC Elections 2024

Telangana MLC Elections 2024 : అసెంబ్లీ నియోజకవర్గం కోటా కింద ఖాళీ ఆయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే ఓటును ప్రాధాన్యతా క్రమంలో ధాఖలు చేయాలన్న బీఆర్​ఎస్​ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఇందులో జోక్యం చేసుకోలేమంది. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్నికలు రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేసింది.

EC Issued Notification for MLC Elections
High Court Dismiss BRS Petition on MLC Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 10:15 AM IST

Telangana MLC Elections 2024 : గత డిసెంబరు 3వ తేదీన కడియం శ్రీహరి, పాడి కౌశిక్​ రెడ్డిల రాజీనామాలతో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలపై ఎన్నికల షెడ్యూలును విడుదల చేస్తూ జనవరి 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికను నిర్వహిస్తున్నట్లుగా తెలుపు, గులాబీ రంగుల బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నట్లుగా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈసీ ప్రతికా ప్రకటనకు సవాలు చేస్తూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్​(BRS) అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్​లతో కూడిన ధర్మాసనం గురువారం రోజున విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నియోజకవర్గం కోటా కింద ఎన్నుకున్నారని కోర్టుకు తెలిపారు. ఖాళీ అయిన స్థానాలకు అధికణ (4) కింద ఒకే ఓటు బదలాయింపు పద్ధతిలో ఎన్నిక నిర్వహించాల్సి ఉందని చెప్పారు.

EC Issued Notification for MLC Elections : ఎన్నికల సంఘం రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలను(MLC Elections) నిర్వహించడం ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని రోహిత్గి పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ కాలేదని అందువల్ల ఇది న్యాయ సమీక్షకు అడ్డంకి కాదని అన్నారు. అడ్డంకులను తొలగించి ఎన్నికలు సాఫీగా నిర్వహించడంలో భాగంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు పేర్కొందని తెలిపారు.

లోక్​సభ ఎన్నికలపై కాంగ్రెస్​ వ్యూహం - అత్యధిక స్థానాలే లక్ష్యంగా దిశానిర్దేశం

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిన తరువాత ఏర్పడే ఖాళీలకు అధికరణ 171 కింద ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు.పదవీ కాలం పూర్తి కాకుండా రాజీనామాలు, ఇతర కారణాలతో ఏర్పడిన ఖాళీలకు అధికరణం 151 కింద ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ అధికరణ కింద రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఈ విధానాన్ని సమర్థించిందన్నారు. అంతేకాకుండా ఈనెల 29న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిందని కోర్టులు జోక్యం చేసుకోరాదని అన్నారు.

ఇరువైపుల వాదనలను విన్న ధర్మాసనం పదవీ కాలం పూర్తి కాకముందు ఏర్పడే సాధారణ ఖాళీలను భర్తీ చేయడానికి అధికరణ 151 కింద నోటిపికేషన్ జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల ఎన్నికల సంఘం 4వ తేదీన జారీ చేసిన ప్రెస్​నోట్ అధికరణం 171(4)కు ఉల్లంఘన అన్న వాదన అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ కొట్టివేసింది.

కాంగ్రెస్​ పార్టీకే దక్కనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు - బీఆర్​ఎస్​కు షాక్​ తప్పదా?

తార్ ​మార్ తక్కర్ ​మార్ ​- మళ్లీ టీఆర్​ఎస్​గా మారనున్న బీఆర్ఎస్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.