ETV Bharat / state

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛన్​ ఇవ్వాలని కేసీఆర్​కు విజ్ఞప్తి - Telangana Kidney Patients Welfare Association news

తెలంగాణ కిడ్నీపేషంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛన్​ ఇవ్వాలని కేసీఆర్​కు విజ్ఞప్తి చేసింది. రోగులకు నెలకు 10,000 రూపాయల పింఛన్‌ అందించాలని కోరింది.

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛన్​ ఇవ్వాలని కేసీఆర్​కు విజ్ఞప్తి

author img

By

Published : Feb 10, 2021, 2:16 PM IST

కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ దశకు చేరుకున్న రోగులకు నెలకు 10,000 రూపాయల పింఛన్‌ అందించాలని తెలంగాణ కిడ్నీపేషంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్​కు విజ్ఞప్తి చేసింది.

కిడ్నీలు పాడై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్‌ వేల్ఫేర్‌ అసోషియేషన్ అధ్యక్షుడు సీహెచ్‌ మోహన్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.

డయాలసిస్ చేయించుకుంటున్న రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర వేదనకు గురి కావాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ చేయించుకుంటున్న ఒక్కో కుటుంబంపై సుమారు 25 వేలకు పైగా ఆర్థికభారం పడుతుందని మోహన్ వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నీ బాధితులకు రూ 10,000 పెన్షన్ అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని తమను ఆదుకోవాలని అని వేడుకొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.