ETV Bharat / state

Telangana High Court on Farmers Issues : ఏదో ఒకటి చేసి ఆ రైతులను ఆదుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Telangana High Court on Farmers Issues : రాష్ట్రంలో పంటల సమగ్ర బీమా పథకం అమలు చేయాలని.. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది భాస్కర్​ హైకోర్టుకు రెండు లేఖలు రాశారు. ఆ రెండు లేఖలను సుమోటో పిల్​గా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రెండు కేసుల్లో ఆరు వారాల్లో కౌంటర్​ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి.. ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Telangana High Court
Telangana High Court Suo Moto on Farmers Issues
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 9:08 AM IST

Updated : Oct 11, 2023, 9:18 AM IST

Telangana High Court Suo Moto on Farmers Issues : పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు(Telangana High Court) తెలిపింది. ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తున్నప్పటికీ.. ఏదైనా ప్రత్యేక పథకం, నిబంధన ఉంటే బాగుంటుందని పేర్కొంది. రాష్ట్రంలో పంటల సమగ్ర బీమా పథకం అమలు చేయాలని కోరుతూ న్యాయవాది భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్​గా స్వీకరించింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఎలాంటి బీమా పథకం లేదని.. పీఎం ఫసల్ బీమా యోజన (PM Fasal Bima Yojana)కూడా అమలు చేయడం లేదని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ అలోక్​ అరాధే, జస్టిస్​ ఎన్​.వి.శ్రవణ్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ విచారణలో ప్రతివాదులైన కేంద్ర ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖలకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, హార్టికల్చర్​ డైరెక్టర్​, వ్యవసాయ శాఖ కమిషనర్​లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

Spurious Seeds In Telangana : ఇంకెనాళ్లీ నకిలీ విత్తనాల బెడద.. రైతుకు భరోసా లేదా?

High Court notices to Telangana Govt in Spurious Seeds : నాసిరకం విత్తనాల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నకిలీ విత్తనాలు అరికట్టాలంటూ న్యాయవాది భాస్కర్ రాసిన మరో లేఖను కూడా హైకోర్టు సుమోటో పిల్​గా స్వీకరించింది. ఈ పిల్​పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ అలోక్​ అరాధే, జస్టిస్​ ఎన్​.వి.శ్రవణ్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ లేఖలోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, విత్తన, ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను ఆరు వాారాలకు వాయిదా వేశారు.

High Court Notice to telangana Govt on Crop Relief Failure: లేఖా సారాంశం ఇదీ : తెలంగాణలో 2.20 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని.. అందులో 58.33 లక్షల మంది రైతులు వరి, పత్తి, మిరప, వేరు శనగ తదితర పంటలను ప్రతి ఏడాది సాగు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో పంటల బీమాను అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో 2.23 లక్షలు, ఏప్రిల్​ చివరి వారంలో 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్లు ప్రాథమికంగా అంచనా వేశారని వివరించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలను పరిహారంగా చెల్లించిందని పేర్కొన్నారు.

Crop compensation credited in Telangana : రైతుల ఖాతాల్లో పంట పరిహారం

Fake Cotton Seeds In Telangana : తెలంగాణ రైతుపై "నకిలీ విత్తనం" పడగ

Last Updated : Oct 11, 2023, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.