ETV Bharat / state

'లాక్​డౌన్​లో విద్యుత్ బిల్లుల మాఫీపై ప్రభుత్వ వైఖరి చెప్పాలి'

author img

By

Published : Jun 22, 2020, 8:18 PM IST

లాక్​డౌన్ వల్ల ప్రజలు ఆర్థిక వనరులు కోల్పోయినందున విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేరని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారించింది. లాక్​డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలన్న అంశంపై ప్రభుత్వ వైఖరి తెలపాలని ఆదేశించింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎస్​పీడీసీఎల్, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్​కు తెలిపింది.

telangana high court said Lockdown down government's stance on waiver of electricity bills
'లాక్​డౌన్​లో విద్యుత్ బిల్లుల మాఫీపై ప్రభుత్వ వైఖరి చెప్పాలి'

లాక్​డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలన్న అంశంపై ప్రభుత్వ వైఖరి తెలపాలని హైకోర్టు ఆదేశించింది. లాక్​డౌన్ వల్ల ప్రజలు ఆర్థిక వనరులు కోల్పోయినందున విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేరని హైకోర్టులో పిల్​ దాఖలైంది. న్యాయవాది నరేష్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

కౌంటరు దాఖలు చేయాలి

ఆ అంశంపై రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎస్​పీడీసీఎల్, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్​ను హైకోర్టు ఆదేశించింది. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని వాటిని సవరించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్​పై కూడా విచారణ జరిగింది.

6 వేలకు పైగా ఫిర్యాదులు

వినియోగదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఉన్నందున తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. శ్లాబులపై అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేషన్ కమిషన్​కు 6,767 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 6,678 పరిష్కరించినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చూడండి : ప్రతి కార్యకర్త పది మొక్కలు నాటాలి: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.