ETV Bharat / state

చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్​పర్సన్లు లేకపోవడమేంటి?: హైకోర్టు

రెండేళ్లుగా మహిళా కమిషన్​కు ఛైర్​పర్సన్ నియమించడం లేదన్న పిల్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్​పర్సన్లను నియమించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పుడు నియమిస్తారో వారం రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

author img

By

Published : Oct 5, 2020, 3:26 PM IST

telangana-high-court-hearing-on-women-commission-chairperson
'చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్​పర్సన్లు లేకపోవడమేంటి?'

రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్ నియమించడం లేదన్న పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రెండేళ్లుగా ఛైర్​పర్సన్​ లేరన్న రేగులపాటి రమ్యారావు లేఖపై చర్చించి... చట్టబద్ధమైన సంస్థలకు ఛైర్‌పర్సన్లను నియమించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నియామకానికి ఏం చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. వివరాలు సమర్పించేందుకు... 4 వారాల గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్​ కోరారు. ఎంతకాలంలో నియమిస్తారో వారం రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వానికి... హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాది వసుధ నాగరాజ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది.

ఇదీ చూడండి: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై హైకోర్టు కీలక నిర్ణయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.