ETV Bharat / state

Telangana Govt Issued Orders Grain Auction : ధాన్యం బహిరంగ వేలానికి రంగం సిద్ధం.. ఉత్తర్వులు జారీ - 20 లక్షల టన్నుల యాసంగి ధాన్యం వేలం

Telangana Govt Issued Orders Grain Auction : రాష్ట్రంలో ధాన్యం బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైస్ మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు విడతల వారీగా ధాన్యం విక్రయించాలని నిర్ణయించిన దృష్ట్యా తొలి దశలో 15 నుంచి 20 లక్షల టన్నులు వేలం వేసేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్ల అభ్యర్థన మేరకు ధాన్యం వేలం వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి.

Grain Auction In Telangana
Telangana Govt Issued Orders Grain Auction
author img

By

Published : Aug 10, 2023, 9:11 PM IST

Telangana Govt Issued Orders Grain Auction : రాష్ట్రంలో ధాన్యం వేలం వేసేందుకు సర్కారు సిద్ధమైంది. 2022-23 వానా కాలం, యాసంగి సీజన్లు సంబంధించి రైస్‌మిల్లుల్లో భారీగా పేరుపోయిన మిగులు ధాన్యం నిల్వలు వేలం వేయాలని నిర్ణయించింది. అకాల వర్షాలకు ధాన్యం(Grain) తడిసి నాణ్యత కొరవడి నూక శాతం అధికంగా వస్తుందన్న కారణంగా ఎఫ్‌సీఐ(FCI) ఆ ధాన్యం తీసుకునేందుకు వెనకాడుతోంది. గత నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆధ్యక్షతన జరిగిన సమీక్ష అనంతరం తాజాగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టం మిల్లింగ్ రైస్ - సీఎంఆర్ డెలివరీ, ధాన్యం మిల్లింగ్‌ సామర్థ్యం పెంపు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ధాన్యం వేలానికి కమిటీ నియమించిన ప్రభుత్వం : దశల వారీగా వేలం వేసి ధాన్యం విక్రయిస్తామని ఇటీవల శాసనసభలో కూడా తన ప్రసంగంలో సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే. 2022-23 మిల్లింగ్ సామర్థ్యం పెంపు, మిగులు ధాన్యం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి కమిటీ - ఎస్‌ఎల్‌సీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యహరించనున్నారు. అలాగే, కమిటీ సభ్యులుగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ ఎండీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను నియమించింది.

Telangana Milling Industry : మిల్లింగ్‌ ఇండస్ట్రీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు

Yasangi Paddy Open Auction In Telangana : రాష్ట్రంలో రైస్ మిల్లుల్లో ఎంత ధాన్యం నిల్వ ఉంది? ఎంత వేలం వేయవచ్చు? ధరల నిర్ణయం.. మిగులు ధాన్యం వేలం విధివిధానాల రూపకల్పనపై ఈ రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పెంపొందించడం, తడిసి దెబ్బతిన్న మిగులు వరి వేలం కోసం పద్ధతుల తయారీ సంబంధించి ధాన్యం సేకరణ, పరిమాణం, అవసరమైన సామర్థ్యం, లోటు మిల్లింగ్ సామర్థ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడం ఈ కమిటీ విధి.

custom milling rice problems : కస్టమ్ మిల్లింగ్​కు కష్టాలు.. గుట్టలుగా పేరుకుపోతున్న ధాన్యం బస్తాలు

Twenty Lakh Tonnes Grain Auction In Telangana : త్వరితగతిన పరిశ్రమలు స్థాపించడం, ఒక సంవత్సరంలోపు కార్యాచరణలోకి తీసుకురావడానికి టర్న్-కీ ప్రాతిపదికన సరైన సాంకేతికతను గుర్తించడం, పెట్టుబడిదారుల భయాందోళనలను క్లియర్ చేస్తూ రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ప్రేరేపించాల్సి ఉంటుంది. బియ్యం, దాని ఉప ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెటింగ్ కోసం మార్గాలు సృష్టించడం, ప్రస్తుత కస్టమ్ మిల్లింగ్ విధానానికి మార్పులు, ఆ సామర్థ్యం ఆధారంగా నిర్దిష్ట పరిమాణంలో తప్పనిసరి మిల్లింగ్‌ నిర్ధారించడానికి కార్యాచరణ సిద్ధం చేయాల్సి ఉంటుంది. మిగులు వరి వేలం కోసం విధివిధానాలను సిద్ధం చేయడంలో భాగంగా ధాన్యం నాణ్యత అంచనా వేసేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఏయేటికాయేడు ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మిల్లింగ్‌కు రైస్ మిల్లర్ల వద్ద అంత సామర్థ్యం లేదు. ఉత్పత్తయ్యే ధాన్యం, సీఎంఆర్‌కు మధ్య అంతరం, నిల్వ చేసేందుకు స్థలాభావం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి కోటి టన్నులు పైగా ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇందుకు సెప్టెంబరు వరకు గడువు ఉంది. వానా కాలం పంట మిల్లింగే పూర్తి కాలేదు. యాసంగిలో తడిసిన ధాన్యం తీసుకోవాలంటూ తమపై ఒత్తిడి చేశారని రైల్ మిల్లర్లు వాపోతున్నారు.

Grain Auction In Telangana : ఈ ఏడాది వానా కాలం సంబంధించి అక్టోబరులో మరో కోటి టన్నుల ధాన్యం దిగుబడి రానున్న దృష్ట్యా వేలం వేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం వ్యక్తం చేశారు. ఇందులో గత యాసంగిలో వచ్చిన 66.02 లక్షల టన్నులు ధాన్యం అమ్మకానికి తొలి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఎఫ్​సీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్కారు ధాన్యం వేలం వేయాలని నిర్ణయించింది.

పెరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు.. నిల్వలు ఏం చేయాలి..?

Paddy Procurement Amount Delay : ఓ సారూ.. ధాన్యం డబ్బులు చెల్లించండయ్యా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.