Telangana Govt Given IAS Officers Postings : రాష్ట్రంలో కొలువుదీరిన కొత్తప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటుతో రాష్ట్రస్థాయి పరిపాలన వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చాయి. ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో పెద్దఎత్తున బదిలీలు, స్థానచలనం చోటుచేసుకున్నాయి. కొత్త సర్కారు ఏర్పడినప్పుడు వారి ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా అధికారుల పోస్టింగులు ఉండటం సహజం. ఈ క్రమంలోనే 2021 బ్యాచ్ తొమ్మిదిమంది ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
- హన్మకొండ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తా
- ములుగు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.శ్రీజ
- నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్
- రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.గౌతమి
- జనగాం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.పి.లలిత్ కుమార్
- మహబూబాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా లెనిన్ వత్సల్
- మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్
- వనపర్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా సంచిత్ గాంగ్వార్
- జయశంకర్ భూపాలపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.కదిరవన్
టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు కారం రవీందర్రెడ్డి రాజీనామా
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ - హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి