ETV Bharat / state

పాలనను పరుగులు పెట్టించే దిశగా ఆలోచన - త్వరలోనే అధికార యంత్రాంగ ప్రక్షాళణ - ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా శివధర్‌ రెడ్డి నియామకం

Telangana Govt Focus On IAS, IPS Transfers : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీకి కసరత్తు జరుగుతోంది. చురుగ్గా నిర్ణయాలు తీసుకుని సమర్ధవంతంగా, పారదర్శకంగా పని చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన అధికారులకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేసేందుకు వీలుగా కూడా ఈ బదిలీలు, నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. అధికారుల గత చరిత్ర, పారదర్శకత, సమర్ధతలే ప్రామాణికంగా బదిలీలు, నియామకాలు ఉండేట్లు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలోనే ఈ కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

Govt Concentrate On IAs IPs Transfers
Govt Focus Transfers IAS, IPS Officers
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 9:03 AM IST

తెలంగాణలో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల బదిలీకి కసరత్తు - పాలనను పరుగులు పెట్టించే దిశగా ఆలోచనలు

Telangana Govt Focus On IAS, IPS Transfers : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిపాలనను గాడిన పెట్టేందుకు వీలుగా భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆ ప్రభుత్వానికి అనుగుణంగా బదిలీలు చేయడం సర్వసాధారణం. కానీ తెలంగాణాలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన, రాజ్యాంగబద్ద పాలన ప్రజలకు అందిస్తామని స్పష్టం చేస్తోంది. ఆ దిశలో ఇప్పటికే అడుగులు వేసింది.

ప్రగతిభవన్‌ వద్ద ఉన్నకంచను తొలిగించి దాని పేరు కూడా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చడంతోపాటు అక్కడ ప్రజా దర్భార్‌ నిర్వహించే ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేకం చేస్తూ ప్రజలకు చేరువయ్యే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉండడంతో అందుకు అనుగుణంగా అధికారయంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో కొత్త ప్రభుత్వం ఉంది.

Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!

Govt Concentrates On IAs IPs Transfers : గత ప్రభుత్వ పాలన కంటే మెరుగైన రీతిలో ఉండేట్లు ప్రజాపాలన కొనసాగాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు హామీలను అమలు చేయాల్సి ఉన్నందున అందుకు తగ్గట్లు చురుగ్గా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా శివధర్‌ రెడ్డిని నియమించిన ప్రభుత్వం మిగిలిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బదిలీలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Transfers IAS IPS Officers In Telangana : అయితే ఇప్పటికే కొందరు అధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. మరికొందరు తమకు అనుకూలమైన, సీఎంకు దగ్గరగా ఉండే నాయకులను కలిసి కీలక స్థానాల్లో పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో లూప్‌ లైన్‌ పోస్టుల్లో ఉన్నకొందరు అధికారులు కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు రాగానే సీఎంగా రేవంత్‌ రెడ్డినే అవుతారని భావించి సీనియర్‌ నాయకులను ముందస్తుగా కలిసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ చాలా మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమకు అనుకూలమైన పోస్టింగ్‌లు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana AP IAS IPS Allotment Issue : ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల వివాదం.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?

IAS IPS Transfers in Telangana 2023 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం ఐఏఎస్‌, ఐపీఎస్‌ల విషయంలో చాలా కఠినంగా ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా పరిపాలన అందించేందుకు కీలకమైన ఈ రెండు క్యాటగిరిల అధికారుల విషయంలో నిశితంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి అధికారుల గత చరిత్ర క్లీన్‌గా ఉందా లేదా అని చూస్తున్నారు. రెండోది చురుగ్గా నిర్ణయాలు తీసుకుని సమర్ధవంతంగా పని చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అంచనా వేస్తున్నారు.

మూడోది పారదర్శికంగా పని చేయడం ఈ మూడింటి దృష్టిలో ఉంచుకుని అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో పరిపాలన గాడిన పడుతుందని సీఎం విశ్వసిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దాల్సి ఉంది. దీని అంతటిని గాడిన పెట్టి రాబడులను పెంచడం, ఉన్ననిధులు దుర్వినియోగం కాకుండా చూడడం లాంటివి చేసినప్పుడే.. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీల అమలు ప్రక్రియకు ఆటంకాలు లేకుండా ఉంటుందని బావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజులు కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరికొంత మంది పోలీసుల బదిలీ - కారణమిదే!

'పాలనను పరుగులు పెట్టించేందుకు బదిలీలు..!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.