హైదరాబాద్ హెచ్ఐసీసీలో బ్రాంకస్ అంతర్జాతీయ సదస్సుకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. పల్మనాలజీలో ఆధునిక పరిజ్ఞానం తీసుకొచ్చిన యశోదా ఆస్పత్రుల యాజమాన్యాన్ని గవర్నర్ అభినందించారు. ఇంట్రవెన్షనల్ పల్మనాలజీలో ప్రస్తుతం మంచి సాంకేతికత అందుబాటులో ఉందని సౌందరరాజన్ అన్నారు.
గతంలో తాను వైద్య వృత్తిలో ఉన్నప్పుడు... తక్కువ ధరకే అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. తన స్కానింగ్ కేంద్రాన్ని రూ. వంద స్కానింగ్ సెంటర్ అనేవారని తమిళిసై గుర్తు చేసుకున్నారు.
ఇవీచూడండి: మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారండోయ్!