TS Govt Request to SC about Petition on Governor: అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్‌లో పెట్టడంపై.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈనెల 27న విచారించనుంది. గవర్నర్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను వెంటనే విచారించాలని.. అత్యున్నత న్యాయస్థాన్ని ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ఎదుట న్యాయవాది దుష్యంత్ దవే ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ముఖ్యమైన బిల్లులను గవర్నర్ తమిళిసై.. 6 నెలలుగా పెండింగ్‌లో ఉంచారని దుష్యంత్ దవే ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో పంజాబ్ కేసులో సుప్రీం జోక్యం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రజాపయోగమైన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఈనెల 27న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
అసలేం జరిగిదంటే: గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌లో గత సంవత్సరం సెప్టెంబర్ 14 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. గవర్నర్ బిల్లును రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం.. ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని వివరించారు. ఆర్థికపరమైన బిల్లు కాకపోతే.. మళ్లీ పరిశీలించాలని చట్ట సభలను కోరవచ్చని పేర్కొంది.
గవర్నర్ 163వ ఆర్టికల్ ప్రకారం .. సీఎం నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు విధులు నిర్వర్తించాలి తప్ప.. స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదని.. షంషీర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని గుర్తు చేశారు. మంత్రిమండలి సలహాకు విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించి సమాంతర పాలనకు అవకాశం లేదని కూడా వ్యాఖ్యానించినట్లు వివరించారు. ఇతర అవకాశాలు ఏవీ లేక ధర్మాసనాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. రాజ్యాంగ సభ చర్చలు, రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పిటిషన్‌లో పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీనియర్ అధికారులతో గవర్నర్ తమిళిసైని కలిశారని ప్రభుత్వం పిటిషన్‌లో తెలిపింది. , ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుల ఆవశ్యకత, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ప్రాధాన్యతను వివరించడంతో పాటు సందేహాలను నివృత్తి చేశారని పేర్కొంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా బిల్లులకు త్వరగా ఆమోదముద్ర వేయాలని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించింది. త్వరలోనే బిల్లులను ఆమోదిస్తానని మంత్రులకు గవర్నర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల ఐకాస: మరోవైపు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వర్సిటీలో అధ్యాపకుల నియామక బిల్లును నిరసిస్తూ రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల ఐకాస నేతలు యత్నించారు. ఈక్రమంలో ఆందోళనకారులను పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు.
గవర్నర్ తమిళిసై వెంటనే యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును వెంటనే ఆమోదించాలని బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆమె నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దాదాపు 5 నెల కింద బిల్లులు పాస్ చేసి పంపిస్తే.. ఇప్పటివరకు గవర్నర్ బిల్లు ఆమోదించకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తమిళిసై బిల్లు ఆమోదించే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులపై సుప్రీంను ఆశ్ర
RRRపై 'రాజ్యసభ' ప్రశంసలు.. పార్లమెంట్లో రెండోరోజూ 'రాహుల్' రగడయించిన రాష్ట్ర ప్రభుత్వం