ETV Bharat / state

కాసుల వర్షం కురిపిస్తోన్న పాత పద్ధతి..

author img

By

Published : Dec 28, 2020, 5:11 AM IST

Updated : Dec 28, 2020, 7:00 AM IST

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజుల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం చేకూరింది. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగడం వల్ల ఈ మేరకు రాబడులు వచ్చాయి. రోజుకు వంద కోట్లకుపైగా రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆదాయం వచ్చింది.

కాసుల వర్షం కురిపిస్తోన్న పాత పద్ధతి..
కాసుల వర్షం కురిపిస్తోన్న పాత పద్ధతి..
కాసుల వర్షం కురిపిస్తోన్న పాత పద్ధతి..

రాష్ట్రంలో ఐదు రోజుల వ్యవధిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకి రూ.591.18 కోట్ల ఆదాయం సమకూరింది. 3 నెలల విరామం తర్వాత ఈ నెల 21 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. కార్డు ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రద్దీగా మారాయి.

ఆ భయంతో కొంత..

గత సోమవారం నుంచి శనివారం వరకు... 19 వేల 620 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వాటి రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.213.65 కోట్లు..., స్టాంపు విక్రయాల ద్వారా మరో రూ.377.53 కోట్లు వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో.. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. తద్వారా ప్రభుత్వానికి.... 3 వేల 773 కోట్లు రూపాయల ఆదాయం వచ్చింది. రోజుకు సగటున వంద కోట్లుకుపైగా రిజిస్ట్రేషన్ శాఖకు రాబడి వస్తోంది. మళ్లీ పాతపద్ధతి ఎక్కడ నిలిచిపోతుందనే అనుమానాలతో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు తొందరపడుతున్న అధికారులు అంచనావేస్తున్నారు.

ఇదీ చూడండి: విద్యారంగంపై మహమ్మారి మాయజాలం.. మధ్యలో ఆగిన చదువులు

Last Updated : Dec 28, 2020, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.