compensation for polling personnel: ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం పెంచింది. గతంలో గరిష్ఠంగా చెల్లిస్తున్న రూ.10 లక్షల పరిహారాన్ని కనీసం రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా పరిహారాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు.
వారికి రూ.30 లక్షలు
died in election duties: ఎన్నికల విధి నిర్వహణలో తీవ్రవాదులు లేదా అసాంఘిక శక్తుల చర్యల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.20 లక్షల పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవైకల్యం ఏర్పడే వారికి ఇచ్చే మొత్తాన్ని కూడా రూ.7.5 లక్షలకు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇలాంటి ఘటనల్లో పరిహారం ఇచ్చే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించే జీహెచ్ఎంసీ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.
ఇవీ చూడండి: