గతేడాది అక్టోబరు 29న ధరణి పోర్టల్ (dharani portal)ను ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) ప్రారంభించారు. నవంబరు 2 నుంచి సేవలు మొదలయ్యాయి. పోర్టల్లో 41 రకాల మాడ్యూళ్లు ఉన్నాయి. వాటిలో 31 లావాదేవీలకు సంబంధించినవి కాగా.. 10 సమాచారాన్ని తెలిపేవి ఉన్నాయి. దాదాపు 60 లక్షల వ్యవసాయ ఖాతాలకు సంబంధించిన భూముల సమాచార తోపాటు గ్రామ పటాలను ఏర్పాటు చేశారు. శనివారం నాటికి ధరణి ఆదాయం (dharani portal revenue) రూ.1500 కోట్లను దాటిందని ప్రభుత్వం ప్రకటించింది.
భూ సమస్యల పరిష్కారానికి వీలుగా ధరణి పోర్టల్లో మరికొన్ని ఐచ్ఛికాలను కొద్ది రోజుల్లో ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం (Cabinet Sub-Committee) దృష్టి సారించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఈ నెల రెండో తేదీ నాటికి వచ్చిన వాటిలో పెండింగ్ మ్యుటేషన్లు (Pending mutations) 2.07 లక్షలు. ఇతర భూ సమస్యలు 178 లక్షలు, కోర్టు కేసులు 24 వేలు, పాసుపుస్తకం లేకున్నా వారసత్వ బదిలీలు 12 వేలు, పాసుపుస్తకం లేని భూములకు నాలా అనుమతులు 828, నిషేధిత జాబితాకు సంబంధించి 51 వేల సమస్యలను పరిష్కరించారు.
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ధరణిలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) ఆదేశించింది. ధరణి పోర్టల్లో(dharani portal) వచ్చే సమస్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు (minister harish rao) అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం బీఆర్కే భవన్లో ఇటీవల సమావేశమైంది. ధరణిలో ఉన్న సమస్యలు, ఫిర్యాదులు, వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించింది.
ఈ సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఇబ్బందులపై మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee review) సమీక్షించింది. ధరణిలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలకు, రైతులకు మరింత మేలు జరుగుతుందని తెలిపింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ఈ నెల 17వ తేదీన మరోమారు సమావేశం నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) నిర్ణయించింది.
ఇదీ చూడండి: Dharani Meeting: 'ధరణి'పై మంత్రివర్గ ఉప సంఘం భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ