ETV Bharat / state

మూసీపై దృష్టి పెట్టి.. సాగర్‌ను వదిలిపెట్టి.. - సాగర్ వార్తలు

‘భాగ్యనగరానికి మరో మణిహారంగా హుస్సేన్‌సాగర్‌ను తీర్చిదిద్దుతాం.. సరస్సును పూర్తిగా మంచినీటితో నింపడమే కాకుండా ఇదో ఆహ్లాదకర ప్రాంతంగా మారుస్తాం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఇదో పర్యాటక ప్రాంతంగా కనిపించేలా చేస్తాం.. సాగర్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలను నిర్మిస్తాం..’ అయిదేళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది.

telangana-government-focusing-on-musi-river-and-leaving-sagar
మూసీపై దృష్టి పెట్టి.. సాగర్‌ను వదిలిపెట్టి..
author img

By

Published : Mar 31, 2021, 8:13 AM IST

హుస్సేన్‌సాగర్‌ శుద్ధజలంతో ఆహ్లాదకర ప్రాంతంగా ఉందా అంటే ఎవరైనా పెదవి విరిచేస్తారు. పదిహేనేళ్లగా సాగర్‌ ప్రక్షాళన కోసం దాదాపు రూ.450 కోట్లకుపైగా వ్యయం చేశారు. ఆ నిధులన్నీ సా‘గరళం’లో పోసినట్లే. కాలుష్య రహితంగా తీరిదిద్దుతామని ప్రకటించిన హెచ్‌ఎండీఏ తాజాగా చేెతులెత్తేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరస్సును పూర్తిగా ప్రక్షాళన చేయడం తమ ఒక్కరి వల్ల కాదని తేల్చేసింది. సాగర్‌లోకి ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలు కలిసి భూగర్భం విషతుల్యంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూకట్‌పల్లి నాలా నుంచి ప్రమాదకర వ్యర్థాలు

చారిత్రక ప్రసిద్ధి చెందిన హుస్సేన్‌సాగర్‌ 1562లో నిజాం హయాంలో నిర్మితమైంది. మొదట్లో ఈ సరస్సు 576.23 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండేది. చుట్టూ నిర్మాణాలు రావడంతో ప్రస్తుతం 479 హెక్టార్లకే పరిమితమైంది. 1930 వరకు ఈ సరస్సు నగరానికి తాగునీటిని సరఫరా చేసింది. ఒకప్పుడు మురుగు కలిసేది కాదు. మహానగరంలో మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వరద నీరు పారే నాలాల్లోకి మురుగునీటిని మళ్లించారు. కీలకమైన కూకట్‌పల్లి, బల్కాపూర్‌, బంజారా, పికెట్‌ నాలాల్లోకి వచ్చిన మురుగు నెమ్మదిగా సాగర్‌లోకి కలవడం మొదలైంది.

బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి..

పదేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జపాన్‌ సంస్థ జైకా నుంచి రూ.310 కోట్ల నిధులను రుణం కింద తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లను కేటాయించింది. మొత్తం మీద రూ.370 కోట్లతో సరస్సు ప్రక్షాళన మొదలుపెట్టినా సక్రమంగా జరగలేదు. బంజారా, పికెట్‌, బల్కాపూర్‌ నాలా నుంచి వచ్చే మురుగునీరు సాగర్‌లో కలవకుండా కొంతవరకు అడ్డుకట్ట వేసినా కూకట్‌పల్లి నాలాల నుంచి వచ్చే మురుగును అడ్డుకోలేకపోయారు. ఆ నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఈ విషయాన్ని ఇటీవల కాగ్‌ కూడా ఎండగట్టింది. ఈ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారు. ఈ నాలా నుంచే వచ్చే మురుగు సాగర్‌లో కలవకుండా మళ్లించేలా పైపులైన్‌ వేశారు. ఇందుకోసం జలమండలి రూ.90 కోట్ల - రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఈ నిధులూ నిరుపయోగమయ్యాయి.

విషపూరిత నాలా..

మహానగరంలో అత్యంత విషపూరిత నాలాగా కూకట్‌పల్లి నాలాకు పేరుంది. జీడిమెట్ల, పటాన్‌చెరు ప్రాంతాల పరిశ్రమల నుంచి వచ్చే అత్యంత విషపూరితమైన వ్యర్థాలను కొంతమంది ట్యాంకర్లతో తెచ్చి ఇందులో కలుపుతున్నారు. ఈ నాలా వెంట జీవిస్తున్న వేలాది కుటుంబాలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ నాలాలోని పూడిక తీయడానికీ ఎవరూ ముందుకు రావడం లేదు. హుస్సేన్‌సాగర్‌లో పూడిక తీయించి మంచినీటితో నింపాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. దీనిపై హెచ్‌ఎండీఏ అధికారులు నిపుణులతో చర్చించారు. విషతుల్యమైన పూడికను ఎక్కడ వేసినా భూగర్భం కూడా విషతుల్యమై పంటలు పండించడానికీ వీలుపడదని తేల్చారు. దీంతో ఆ ప్రతిపాదనా అటకెక్కింది. మూసీ నదిని రూ.3,500 కోట్లతో సుందరీకరిస్తామని చెబుతున్న సర్కార్‌.. సాగర్‌ గురించి మాట్లాడకపోవడంపై కొందరు మండిపడుతున్నారు. కనీసం కూకట్‌పల్లి నాలా నుంచి వ్యర్థాలను కలవకుండా చేసినా కొంతవరకు సాగర్‌ నాణ్యత మెరుగుపడుతుంది. ప్రతినెలా ట్యాంక్‌బండ్‌కు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 20 లక్షల మంది వస్తున్నారని అంచనా. సాయంత్రం అయిందంటే ముక్కుపుటాలదురుతుంటాయి.

ఇదీ చూడండి: కబడ్డీ ఆడుతూ కింద పడ్డ మంత్రి మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.