ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు మంచి రోజులు.. సమస్యల పరిష్కారానికి సర్కార్ ప్రణాళిక

Govt to Solve all issues in Telangana : పథకాల వేగవంతం, సమస్యల పరిష్కారం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కార్యాచరణ వేగవంతం చేయనుంది. పోడు భూములు, ధరణి సమస్యల పరిష్కారంతో పాటు దళితబంధు వేగవంతం, ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం, కంటి వెలుగు రెండో దఫా తదితర అంశాలపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఇందుకోసం త్వరలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహించి ప్రణాళిక ప్రకటించనుంది.

Telangana Government focused on all problems
Govt to Solve all issues in Telangana
author img

By

Published : Nov 22, 2022, 6:45 AM IST

Govt to Solve all issues in Telangana : మునుగోడు ఉపఎన్నిక పూర్తి కావడంతో పాలనా పరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు సిద్ధమైంది. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు వేగవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు ఇతర అంశాలపై బేరీజు వేసుకున్న సీఎం.. రహదార్ల మరమ్మత్తులపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని ఆర్​ అండ్​ బీ, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించారు.

రహదార్ల మరమ్మత్తులు నిత్య ప్రాతిపదికన జరగాలన్న ముఖ్యమంత్రి... రెండు శాఖల్లోనూ సంస్కరణలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు వేగవంతంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. జనవరి 18 నుంచి రెండో విడత కంటివెలుగు నిర్వహించనున్నారు. దళితబంధు పథకం అమలును కూడా వేగవంతం చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గానికి 500 కుటుంబాల చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయాలని ఇటీవల పార్టీ సమావేశంలో తెలిపారు.

అయితే ఎమ్మెల్యేల సిఫార్సు ఉండరాదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విధివిధానాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రక్రియ వేగవంతంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ధరణి సమస్యల పరిష్కారంపై రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. నిషేధిత జాబితాలో పొరపాటుగా పడ్డ భూముల తొలగింపు సహా ఇతర సమస్యల పరిష్కారం దిశగా గత కొన్నాళ్లుగా ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు పోడుభూముల సమస్య పరిష్కారం కూడా కసరత్తు జరుగుతోంది. వచ్చిన దరఖాస్తుల పరిశీలన, సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ కసరత్తు పూర్తయ్యాక గ్రామ సభలు నిర్వహించి పట్టాలు సిద్ధం చేయనున్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి 3 లక్షల రూపాయల చొప్పు ఆర్థికసాయం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ హామీ అమలు దిశగా ప్రక్రియ ప్రారంభించాలని సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. వీటన్నింటికి సంబంధించి ఓ కార్యాచరణ ఖరారు చేసి అమలు ప్రణాళిక ప్రకటించనుంది. అందులో భాగంగా త్వరలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశమై దిశానిర్ధేశం చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.