ETV Bharat / state

Meera Kumar on Telangana Formation Day : 'తెలంగాణ ప్రజలు దేనికోసం కొట్లాడారో.. ఆ లక్ష్యం నెరవేరలేదు' - మీరాకుమార్ తాజా వార్తలు

Telangana Decade Celebrations at Gandhi Bhavan : తెలంగాణ ప్రజల పోరాటం చూసి.. కాంగ్రెస్‌ త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని లోక్​సభ మాజీ స్పీకర్ మీరా కుమార్​ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసన్న ఆమె.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గన్​పార్కు వద్ద పార్టీ నేతలతో కలిసి మీరాకుమార్ అమరవీరులకు నివాళులు అర్పించారు.

Telangana Decade Celebrations
Telangana Decade Celebrations
author img

By

Published : Jun 2, 2023, 1:47 PM IST

Telangana Formation Day Celebrations at Gandhi Bhavan : తెలంగాణ ప్రజలు దేనికోసం కొట్లాడారో.. ఆ లక్ష్యం నెరవేరలేదని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. రాష్ట్రావిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మీరాకుమార్​.. తెలంగాణ ప్రజల పోరాటం చూసి.. కాంగ్రెస్‌ త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసన్న ఆమె.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జ్ మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావేద్, ఎంపీ ఉత్తమ్‌ కుమార్​రెడ్డి, దామోదర రాజ నర్సింహా, పొన్నం ప్రభాకర్​, వీహెచ్​, అంజన్​కుమార్​తో కలిసి గన్‌పార్కుకు చేరుకున్న మీరాకుమార్‌.. అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం.. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ కాంగ్రెస్ చేపట్టిన ఆవిర్భావ దినోత్సవ ర్యాలీని మీరాకుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ మీదుగా ఈ ర్యాలీ గాంధీభవన్‌కు చేరుకుంది.

బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది : అంతకుముందు గాంధీభవన్​లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ఆవిర్భావంపై పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ ఆరోపించారు. పార్టీ నాయకులతో కలిసి మహేశ్​కుమార్​ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ వచ్చిందన్న మహేశ్​కుమార్ గౌడ్.. రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప.. సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో బీజేపీ, బీఆర్ఎస్​లు ఒకటేనని నిరూపితమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు ప్రజలు పట్టం కడతారన్న మహేశ్​ కుమార్ ​గౌడ్... రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు.

ఈసారి తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సోనియమ్మ రుణం తీర్చుకుంటామని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బాగ్ అంబర్​పేట్​లోని తన నివాసం వద్ద వీహెచ్​.. జాతీయ జెండా ఎగురవేసి సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా గన్ పార్కుకు వెళ్లారు.

Revanth reddy wishes on Telangana Formation Day Celebrations : తెలంగాణ యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం, సోనియా గాంధీ కారణంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రేవంత్​రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా పర్యటనకు బయలుదేరిన రేవంత్​కు.. గురువారం జేఎఫ్​కే ఎయిర్​పోర్టులో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సమన్వయకర్తగా నియమితులైన రేవంత్ రెడ్డి.. కాలిఫోర్నియాలో ఈ నెల 4వ తేదీన జరగనున్న సభ ఏర్పాట్లను చూడనున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.