విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్రవాసులు హైదరాబాద్‌కు రానున్నారు. ఆరు దేశాల నుంచి 7 విమానాల్లో 2,350 మంది రాష్ట్రానికి రానున్నారు. వీరికి విమానాశ్రయంలో వైద్యపరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. విదేశాంగ నోడల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సొంత ఖర్చులతో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని కేంద్రం మార్గదర్శకాల్లో తెలిపిందన్నారు. ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా క్వారంటైన్ ప్యాకేజీ తయారుచేయాలన్నారు. విమానాశ్రయం నుంచి క్వారంటైన్‌కు ఆర్టీసీ బస్సుల్లో తరలించాలని ఆదేశించారు. తరచూ పరీక్షలు చేసేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు