TS Employees Bifurcation : నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ పురోగతిపై అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్షించారు. వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో బీఆర్కే భవన్లో సమావేశం నిర్వహించారు. అన్ని కేడర్లకు చెందిన ఉద్యోగుల నుంచి ఐచ్చికాలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాను కూడా ప్రకటించినట్లు చెప్పారు. ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారన్న సోమేశ్ కుమార్... ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాస్థాయుల్లో 56 వేల మంది బదలాయింపులు!
Employees Allocation: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు జోనల్ విధానంలో బదలాయింపులు జరుగుతున్నాయి. జిల్లాస్థాయిలో ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించి, ఐచ్ఛికాల ఆధారంగా వారి సొంత జిల్లాలకు కేటాయింపులు జరిగాయి. వీటన్నింటిని ఆర్థికశాఖలోని ప్రత్యేక పోర్టల్ ఐఎఫ్‌ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్)లో నమోదు చేశారు. దీని ఆధారంగా బదలాయింపులను నిర్దేశిస్తూ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీఅవుతాయి. ఆయా ఉద్యోగులు తమ జిల్లా కలెక్టర్లు, శాఖల ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్ చేయాలి. దాని ఆధారంగా రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తారు. జిల్లాస్థాయుల్లో 56 వేల మంది వరకు ఉద్యోగులకు బదలాయింపులు జరగనున్నాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి: High court on Zonal Allotments: అలాంటి ప్రస్తావన లేదు.. అందుకే స్టే ఇవ్వలేం: హైకోర్టు