ETV Bharat / state

ఎమ్మెల్సీ బరిలో రెండే నామినేషన్లు - మహేశ్, బల్మూరి ఎన్నిక ఏకగ్రీవం! - mlc Mahesh Kumar Goud

Telangana Congress MLC Candidates Nominations Today : ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరబోతున్నాయి. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు రాకపోవడం, ఇవాళే ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన మహేశ్‌కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Telangana Congress MLC Candidates Nominations Today

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 7:06 AM IST

Updated : Jan 18, 2024, 8:14 PM IST

Telangana Congress MLC Candidates Nominations Today : తెలంగాణాలో ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమై కాంగ్రెస్‌ ఖాతాలో జమకానున్నాయి. ఉప ఎన్నికల్లో ఇద్దరే నామినేషన్‌ వేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు కూడా ముగుస్తుంది. రెండు ఎమ్మెల్సీ పదవులకు ఇద్దరే నామినేషన్లు వేయడంతో వారిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

ఈ నెల 22వ తేదీన అధికారికంగా ప్రకటించి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను కూడా ఆ ఇద్దరికి ఇస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్​ఎస్​యుఐ నేపథ్యం నుంచి వచ్చిన ఇద్దరు నాయకులు మండలి సభ్యులుగా పోటీ చేయడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ద్వారా నిరూపించుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Congress MLC Candidates 2024 : ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం దక్కించుకున్న మహేశ్‌కుమార్‌ గౌడ్, బల్మూరి వెంకట్‌ శాసనసభ కోటాలోని రెండు శాసనమండలి స్థానాలకు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు దక్కుతుందని, దానికి ఉదాహరణే మహేశ్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అవకాశమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

ఎన్నికలకు ముందా? ఆ తర్వాతా? - తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై జోరుగా చర్చ

Mahesh Kumar Gowd Story : శాసనమండలి అభ్యర్థిగా ఎంపికైన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ (PCC Working President Mahesh Kumar Goud) బీకాం వరకు చదువుకున్నారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఆయన అంచలంచెలుగా ఎదిగి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగారు. 2014లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశించినా అవకాశం రాలేదు. ఈ సమయంలోనే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామన్న హస్తం పార్టీ నాయకత్వం హామీ మేరకు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మండలికి ఎన్నికయ్యే అవకాశం లభించింది.

టార్గెట్​ 2024- 500 స్థానాల్లో కాంగ్రెస్ సర్వే! సీట్ల పంపకం చర్చలకు ముందే!

ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్న బల్మూరి వెంకట్‌ (NSUI State President Balmuri Venkat) అత్యంత చిన్న వయస్కుడు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌ ఎంబీబీఎస్‌ పట్టభద్రుడు. ఎన్‌ఎస్‌యూఐలో ఉత్సాహంగా పనిచేస్తూ వచ్చిన ఆయన, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. పదేళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో లేకున్నా నిరంతరం యువత, విద్యార్థుల మధ్య ఉంటూ, వారి సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. కీలక అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ వచ్చారు. పోలీసుల నిర్బంధాలు, కేసులను ఎదుర్కొంటూ వచ్చిన బల్మూరి కృషిని గుర్తించిన పార్టీ నాయకత్వం చిన్న వయస్సులోనే పెద్దల సభలోకి పంపాలని నిర్ణయించింది.

Telangana Congress MLC Candidates 2024 : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్‌ జారీకాగా, అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా, ఈ నెల 19న నామపత్రాల పరిశీలన, 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 29న ఎన్నికలు జరగనుండగా ఆ సాయంత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి వెనువెంటనే జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు బరిలో ఎవరూ లేకపోవడంతో ఈనెల 22న మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్​లు ఎన్నిక ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించనున్నారు.

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్​ గురి - ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన

ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్ - కార్యాచరణ సిద్ధం!

Last Updated : Jan 18, 2024, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.