ETV Bharat / state

Telangana Congress Bus Yatra 2023 : ఈనెల 18 నుంచి కాంగ్రెస్​ బస్సు యాత్ర.. కొండగట్టు నుంచి ప్రారంభం - తెలంగాణ బస్సు యాత్ర షెడ్యూల్​ విడుదల

Telangana Congress Bus Yatra 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ వ్యూహాలను రచిస్తోంది. ఈ మేరకు ఈనెల 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు 15కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Telangana Congress Bus Yatra
Telangana Congress Bus Yatra 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 10:04 AM IST

Telangana Congress Bus Yatra 2023 : ఈసారి ఎలాగైనా తెలంగాణ ఎన్నిక(Telangana Polls) లో గెలుపే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్​.. కాంగ్రెస్​ అగ్రనేతలతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర(Telangana Congress Bus Yatra)కు సిద్ధమైంది. ఈ బస్సు యాత్ర షెడ్యూల్​, నిజామాబాద్​ వద్ద భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 18వ తేదీన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాహుల్​, ప్రియాంకగాంధీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని పీసీసీ తెలిపింది. 18నుంచి 21 వరకు నాలుగురోజుల పాటు 15కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నాలుగు రోజులు సాగే బస్సు యాత్ర ప్రతిరోజు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగేలా కార్యాచరణ రూపకల్పన చేశారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా.. 30 వేలకు తక్కువ లేకుండా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. రైతు సమస్యలు సహా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో ఆ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు ఓటర్లను ఆకర్షించేలా ప్రియాంక, రాహుల్ గాంధీ ప్రసంగాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Telangana Congress MLA Candidates List Delay : గెలుపు గుర్రాల ఎంపికపై నత్తనడకన కాంగ్రెస్.. ఇప్పటికైనా వేగం పెంచి కారుని అధిగమిస్తుందా..?

Telangana Congress Election Plan 2023 : రాష్ట్ర నేతలంతా ఐక్యంగా ఉన్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఆ బస్సు యాత్ర దోహదపడుతుందని పార్టీ అంచనా వేస్తోంది. రెండు, మూడు రోజుల విరామం తర్వాత తిరిగి బస్సుయాత్ర ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బస్సు యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ,ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు బస్సు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Congress First List Release 2023 : 58 మంది అభ్యర్థులతో కాంగ్రెస్​ పార్టీ జాబితాను నేడు(ఆదివారం) విడుదల చేయనుంది. గతంలో 70 స్థానాలకు స్క్రీనింగ్​ కమిటీ అభ్యర్థులను ప్రకటించిన.. వామపక్షాలకు సీట్ల కేటాయింపులో ఇంకా చర్చలు నడుస్తున్నందున ఈ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించనున్నారు. వామపక్షాల పొత్తుకు సంబంధించి.. ఐదు స్థానాలను పక్కన పెట్టారు. శనివారం జరిగిన స్క్రీనింగ్​ కమిటీ భేటీలో ప్రియాంక, రాహుల్​గాంధీ పాల్గొనే బస్సుయాత్రలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్​ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి.

Congress Bus Yatra in Telangana 2023 : ఇలా ఎన్నికల షెడ్యూల్ రాగానే.. అలా బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్

Telangana Congress Bus Yatra 2023 : తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదంతో.. కాంగ్రెస్ బస్సు యాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.