గ్రామాభివృద్ధికి పన్నులు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తామని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదన్న సీఎం... పేదలకు భారం కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు.
" గ్రామ పంచాయతీల్లో పన్నుల చెల్లింపునకు సంబంధించి... ఇంటి కొలతలు యజమానులే అందిస్తారు. వారి లెక్కల ప్రకారమే పన్నుల విధింపు ఉంటుంది. ప్రజలపై మాకు నమ్మకం ఉంది.. వాళ్లు నిజాలు చెబుతారనే.. ఆ బాధ్యత అప్పగించాం. అసత్యపు లెక్కలు ఇచ్చిన వారికి 25 రెట్లు జరిమానా విధిస్తాం. అభివృద్ధి కోసం ఛార్జీల పెంపును భరించాలని ప్రజలను కోరుతున్నాను. ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను స్పష్టంగా చెబుతూ చట్టం తెచ్చాం. విధులు, బాధ్యతలు నిర్వహించకపోతే ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం "
-సీఎం కేసీఆర్
- ఇదీ చూడండి : 'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు'