ETV Bharat / state

పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం - police jobs

Telangana Cabinet approval for new posts in police department

author img

By

Published : Dec 10, 2022, 6:30 PM IST

Updated : Dec 10, 2022, 6:50 PM IST

18:28 December 10

పోలీసు శాఖలో మరో 3,966 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం

Cabinet approval for new posts in police department పోలీసుశాఖలో కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలీసు శాఖలో మరో 3,966 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి ఆమోదం తెలపగా.. నియామకానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుశాఖను మరింత పటిష్టం చేసే దిశగా... డ్రగ్స్ నేరాల నివారణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక విభాగం కోసం అదనపు నియామకాలు చేపట్టాలని పోలీసు నియామక మండలికి సూచించింది. కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం పలికింది.

ఇప్పటికే ప్రభుత్వం పోలీసుశాఖలో 17,516 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వేసింది. అందులో 587 ఎస్సై పోస్టులు కాగా... 16,969 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇటీవల ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించగా... ఫలితాలు కూడా వచ్చాయి. అందులో ఉత్తీర్ణులైన వారికి ప్రస్తుతం ఫిజికల్ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 10, 2022, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.