ETV Bharat / state

Telangana Budget Sessions: నేటితో ముగియనున్న బడ్జెట్‌ సమావేశాలు - Telangana Assembly news

Telangana Budget Sessions: ఇవాళ్టితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈరోజు ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చజరగనుంది.

assembly
assembly
author img

By

Published : Mar 15, 2022, 5:22 AM IST

Telangana Budget Sessions: నేటితో బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. చివరిరోజైన ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చజరగనుంది. ఈనెల 7 నుంచి ప్రారంభమైన సమావేశాల్లో... అదే రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 9న బడ్జెట్​పై సాధారణ చర్చ... ఆ తర్వాత నాలుగు రోజుల పాటు పద్దులపై చర్చ జరిగింది. మొత్తం 37 పద్దులు... శాసనసభ ఆమోదం పొందాయి. సమావేశాల చివరిరోజైన నేడు ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చించనున్నారు. శాసనసభ ఆమోదించిన... ఎఫ్​ఆర్​ఎంబీ, మార్కెట్ కమిటీల చట్ట సవరణల బిల్లులపై మండలిలో చర్చ జరగనుంది. ఉభయ సభల్లో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. 2020 మార్చితో ముగిసిన సంవత్సరానికి కాగ్ నివేదికలను శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఇదీ చదవండి:మీరు చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా?: మంత్రి హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.