ETV Bharat / state

వ్యవసాయానికి నూతన జవసత్వాలు: హరీశ్ రావు - telangana state budget 2020

ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రైతుబంధు కోసం బడ్జెట్‌లో రూ.14 వేల కోట్ల కేటాయించామన్నారు. రైతుబీమా కోసం రూ.1,141 కోట్లు, రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు కేటాయించింనట్లు ప్రకటించారు.

వ్యవసాయానికి నూతన జలసత్వాలు కల్పించాం
వ్యవసాయానికి నూతన జలసత్వాలు కల్పించాం
author img

By

Published : Mar 8, 2020, 12:30 PM IST

Updated : Mar 8, 2020, 1:13 PM IST

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయమమైన అభివృద్ధి సాధించామని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. పంటల ఉత్పత్తిలో 23.7 శాతం, పాడిపశువుల రంగంలో 17.3 శాతం,చేపల పెంపకంలో 8.1 శాతం వృద్ధి సాధించామని వెల్లడించారు. రైతుబంధు ద్వారా సత్ఫలితాలు సాధించామని చెప్పారు. కొత్త పాసుపుస్తకాల మంజూరు వల్ల రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల అదనపు కేటాయించినట్లు ప్రకటించారు. రైతుబంధు కోసం బడ్జెట్‌లో రూ.14 వేల కోట్ల కేటాయింపునకు ప్రతిపాదించారు.

రైతు భీమాకు..

రైతు ఏ కారణంతో మృతిచెందినా వాళ్ల కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. 18-60 ఏళ్ల వయసు ఉన్న ప్రతిరైతుకు బీమా సదుపాయం వర్తించనుంది. రైతుబీమా కింద రైతుల ప్రీమియం రూ.2,271.50 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. రైతు మరణించిన 10 రోజుల్లోనే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు. రైతుబీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయించామని చెప్పారు.

వ్యవసాయానికి నూతన జలసత్వాలు కల్పించాం
వ్యవసాయానికి నూతన జలసత్వాలు కల్పించాం

రైతు రుణమాఫీ..

ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టామన్న హరీశ్‌.. రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.25 వేల లోపు రుణాలన్నీ ఒకే విడతలో రుణమాఫీ, రూ.25 వేల లోపు ఉన్న రుణాల మాఫీ కోసం ఈనెలలో రూ.1,198 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. రుణమాఫీ మొత్తాన్ని ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందిస్తామన్నారు. రూ.25 వేల నుంచి రూ.లక్ష లోపు ఉన్న రుణాలను 4 విడతల్లో అందజేస్తామని చెప్పుకొచ్చారు.

వ్యవసాయానికి నూతన జలసత్వాలు కల్పించాం

ఇవీ చూడండి: లైవ్​: అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్​ రావు

Last Updated : Mar 8, 2020, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.