ETV Bharat / state

'భాజపా పాదయాత్రకోసం 23 కమిటీలు' - భాజపా పాదయాత్రపై గుజ్జుల మీడియా సమావేశం

ఆగస్టు 9 నుంచి ప్రారంభమయ్యే భాజపా పాదయాత్ర కోసం 23 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్‌ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

premendar reddy
premendar reddy
author img

By

Published : Jul 13, 2021, 10:54 PM IST

'భాజపా పాదయాత్రకోసం 23 కమిటీలు ఏర్పాటు'

భాజపా పాదయాత్రకోసం 23 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. అన్ని మండలాల్లో పర్యటించాలని ప్రజలు కోరుతున్నందున అనుకున్న దానికంటే ఎక్కువ రోజులే యాత్ర కొనసాగే పరిస్థితి కనిపిస్తోందన్నారు. పాదయాత్ర జయప్రదం, రూట్‌ మ్యాప్‌ రూపకల్పన కోసం పార్టీ సీనియర్‌ నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జులతో సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో అందరి అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తీసుకున్నట్లు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో యాత్ర చేయాలని భావించినప్పటికీ వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కూడా చేయాలని డిమాండ్‌ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాదయాత్ర ద్వారా తెరాస సర్కారు మోసాలను ఎండగడతామని తెలిపారు.

'భాజపా పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటింగానే పెద్దఎత్తున స్పందన వస్తోంది. ఈ పాదయాత్ర ఏవిధంగా ఉండాలి, ఎక్కడెక్కడ పర్యటించాలి, ఏమార్గంలో వెళ్లాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఇలాంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ పాదయాత్రకు జాతీయస్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తాం. సుమారుగా 23 కమిటీలు అటు రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రూటు మ్యాప్​పై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్ని జిల్లాలు, మండలాల్లో పర్యటించాలని ప్రజలు కోరుతున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఈ కమిటీల ఏర్పాటు అనంతరం సమావేశం నిర్వహించి.. రూటు మ్యాప్​ ఖరారు చేస్తాం. హైదరాబాద్​, రంగారెడ్డి, మెదక్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​, కరీంనగర్​, ఆ తర్వాత వరంగల్​, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్​, మహబూబ్​నగర్​ మీదుగా పాదయాత్ర నిర్వహించాలని పలు సలహాలు వస్తున్నాయి.'

-గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

ఇదీ చూడండి: Bandi Sanjay: హుజూరాబాద్​లో తెరాసకు అభ్యర్థి కరవయ్యారు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.